ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజిత్ భట్టాచార్యకు ట్విట్టర్ ఊహించని రీతిలో షాకిచ్చింది. ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళల్ని కించపరిచేలా ట్వీట్లు చేయటం.. అభ్యంతరకర రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని.. అనుచితమైన.. అవమానకరమైన భాషను వాడుతున్నందుకే ఆయన ఖాతాను డిలీట్ చేసేసినట్లుగా ఆయన పేజీలో ట్విట్టర్ సమాచారం ఇవ్వటం సంచలనంగా మారింది.
ఇటీవల జేఎన్‌యూ విద్యార్థిని.. హక్కుల కార్యకర్త షెహ్లా రషీద్ పట్ల ఆయన పలు అభ్యంతరకర ట్వీట్లు చేశారు. ఆమె రెండు గంటల కోసం డబ్బులు తీసుకొని.. తన క్లయింట్‌కు సంతృప్తి ఇవ్వలేదన్న రూమర్ ఉందంటూ వెకిలి కామెంట్లు చేశారు. పలువురు మహిళల మీదా ఆయన ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మహిళా జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదిపై రెచ్చగొట్టేలా.. విద్వేషపూరిత ట్వీట్లు చేయటంపై సోషల్ మీడియాలో ఆయనపై ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ అంశంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన పలువురిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటంతో ఆయన పేజీని రద్దు చేస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది.