గత ఏడాది బాలీవుడ్ తో పాటు దేశం మొత్తం మీద మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ విషయం తెల్సిందే. ఈ సున్నితమైన విషయంపై మాట్లాడేందుకు చాలా మంది స్టార్స్ కూడా కాస్త వెనుక ముందు ఆడారు. మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ పరువు గంగన పడ్డట్లయ్యింది. బాలీవుడ్ లో ఈమద్య మీటూ గురించి ఎక్కువ అయితే వినిపించడం లేదు. కాని తమిళంకు చెందిన చిన్మయి మాత్రం గత కొంత కాలంగా మీటూ ఉద్యమంలో భాగంగా లెజెండ్రీ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. మీటూ ఉద్యమం వల్ల చాలా మంచి జరిగిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు తక్కువయ్యాయి అంటూ మహిళలు అంటున్నారు.
ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ మీటూ పదంను ఎగతాళి చేసినట్లుగా మాట్లాడాడు అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్టైక్ చేస్తే గతంలో తమ ప్రభుత్వం కూడా ఐదారు సార్లు సర్జికల్ స్టైక్ చేశామని చెబుతూ మీటూ.. మీటూ అంటున్నారని మోడీ ఎద్దేవ చేశాడు.
మీటూ అనే పదంను మోడీ ఇలా ఎగతాళి చేసేందుకు వాడటంను చిన్మయి తప్పుబట్టింది. మీవంటి గౌరవ ప్రధమైన పదవిలో ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదండి అంటూ విచారం వ్యక్తం చేసింది. మోడీ ఆ వ్యాఖ్యలు చేయగా జనాలు గట్టిగా నవ్విన వీడియోను చిన్మయి పోస్ట్ చేసింది. బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న మీరు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఆడవారి మనోభావాలు దెబ్బ తీయడం ఏంటంటూ చిన్మయి ప్రశ్నించింది. చిన్మయి పోస్ట్ కు నెటిజర్స్ మద్దతు తెలుపుతున్నారు.