30ల్లో సెక్స్.. సూపరంటోంది

Update: 2017-05-28 08:12 GMT
కేటీ పెర్రీ.. వరల్డ్ పాప్ సంగీతాన్ని ఫాలో అయ్యేవాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తన గాత్రంతోనే కాదు.. తన అందాలతోనూ ఆకర్షించే ఈ భామకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఐదేళ్ల కిందట ఐపీఎల్ ఆరంభోత్సవంలో పెర్ఫామ్ చేయడం ద్వారా భారతీయ అభిమానుల్ని అలరించింది పెర్రీ. ఇప్పుడీ భామ ప్రస్తావన ఎందుకొచ్చిందయ్యా అంటే.. ఈ అమ్మడు తన సెక్సువల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 30 ఏళ్ల వయసొచ్చాక శృంగారంలో పాల్గొనడంలో ఉన్నంత మజా ఇంకెప్పుడూ ఉండదని అంటోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం పెర్రీ వయసు 32.

తన శృంగార జీవితానికి సంబంధించి ఇప్పుడున్నంత హ్యాపీగా ఇంకెన్నడూ లేదని అంది కేటీ పెర్రీ. 30ల్లోకి వచ్చాకే సెక్స్ ను తను మరింత బాగా ఆస్వాదించడం మొదలుపెట్టానని చెప్పింది. ‘‘ఇప్పుడు మీరు శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారా..? ఐతే 30ల్లోకి వచ్చేదాకా ఆగండి.. అప్పుడు అద్భుతంగా ఉంటుంది’’ అని సెలవిచ్చింది కేటీ. మామూలుగా వయసు పెరిగే కొద్దీ శృంగారం మీద ఆసక్తి తగ్గుతుందని అంటారు కానీ.. కేటీ మాత్రం కొంచెం వయసు పెరిగాకే శృంగారంలో మజా అంటోంది. ఒర్లాండో బ్లూంతో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన కేటీ పెర్రీ.. నెల కిందటే అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News