పాప్ స్టార్ కేటీ పెర్రీ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకుంది. హిందూ దేవతను అవమానించందంటూ.. సోషల్ మీడియాలో చీవాట్లు తినాల్సి వస్తోంది. తాజాగా ఈ 32 ఏళ్ల సింగర్.. కాళికా మాత ఫోటోను పోస్ట్ చేసి.. 'ప్రస్తుత మూడ్' అంటూ ట్వీట్ చేసింది.
దేనికి అంత కోపం వచ్చిందో తెలియదు కానీ.. తన మెంటల్ సిట్యుయేషన్ ను చెప్పేందుకు ఇలా హిందూ అమ్మవారి ఫోటో వాడడమే కేటీ పెర్రీ మిస్టేక్ అయిపోయింది. 'భారతీయ దేవతలను అగౌరవ పరచద్దు. మూడ్ చెప్పేందుకు ఇలాంటివి వాడడం సరికాదు. విలువలు పట్టించుకోవాలి' అంటూ కొందుర రియాక్ట్ అయితే.. 'ఇలాంటివి హిందూ సమాజాన్ని బాధకు గురి చేస్తాయి. ఈ ఫోటో వెనక ఉన్న అర్ధం ఏంటో తెలుసుకో ముందు' అంటూ క్లాస్ పీకుతున్నారు మరికొందరు. అయితే.. ఇంకొందరు మాత్రం కేటీకి మద్దతు పలుకుతున్నారు. 'ఇలా ఏదో ఒక పాయింట్ పట్టుకుని హంగామా చేయడం ఎక్కువైపోయింది.. వాటిని పట్టించుకోవద్దు' అంటూ ఆమె చేసిన పనిలో తప్పులేదని అంటున్నారు.
నిజానికి ఈమెకు హిందూ సాంప్రదాయాలు తెలియకపోలేదు. బోలెడంత గౌరవం కూడా. 2010లో ఈమె రసెల్ బ్రాండ్ ను పెళ్లి చేసుకునేందుకు.. రాజస్థాన్ వచ్చి భారతీయ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకుంది. ఫీలింగ్స్ ను వ్యక్తపరచడానికి దేవతలతో పోల్చడం మన దగ్గర కూడా కనిపిస్తుంది కానీ.. ఇక్కడ ఓ ఫారినర్ ఈ పని చేయడమే.. చాలామందికి అభ్యంతరం అవుతోందన్నది.. కేటీని సపోర్ట్ చేస్తున్న వారి వాదన.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/