కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచం మొత్తాన్ని గుప్పిట పట్టి పీడిస్తోన్న కంటికి కనిపించని సూక్ష్మజీవికి అగ్రరాజ్యాలు సైతం కుదేలైపోతున్నాయి. ప్రపంచాన్ని శాసించ గల సత్తా ఉన్న అమెరికా నేడు కరోనాతో కుప్పకూలి పోతోంది. అమెరికాలో కరోనా వ్యాధి విజృంభిస్తున్న సమయంలో ప్రముఖ పాప్ సింగర్ మడోన్నా ఆరోగ్యంపై రూమర్లు పుట్టుకొచ్చాయి. కరోనా బారిన పడటంతో ఆమె ఆరోగ్యం విషమించినట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే తన ఆరోగ్యం గురించి మడోనా ఇటీవల స్పందించి.. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లపై క్లారిటీ ఇచ్చారు.
లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజూ జరిగిన విషయాలను 'క్వారంటైన్ డైరీ' పేరుతో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకుంటున్నారు మడోన్నా. తనకు కరోనా సోకి ఆరోగ్యం విషమించినట్టు వచ్చిన వార్తల గురించి అభిమానులతో పంచుకున్నారు మడోన్నా. ఇటీవల తాను మేడమ్ ఎక్స్ టూర్ చేపట్టిన సమయంలో కరోనా వైరస్ బారిన పడ్డానని.. పారిస్ పర్యటనలో నేను ఇన్‌ఫెక్షన్ కు గురయ్యాను. అయితే పూర్తిగా క్వారంటైన్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకొన్నాను.. దాంతో కోవిడ్ - 19 నుంచి పూర్తిగా బయటపడ్డాను. ఇటీవల చేయించిన పరీక్షల్లో నా శరీరంలో యాండీ బాడీస్ ఉన్నాయనే విషయం స్పష్టమైంది. కరోనాను ఎదిరించే యాంటీబాడీస్ నా శరీరంలో తగినన్ని ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. నేను బాగానే ఉన్నానను.. దేవుడికి కృతజ్ఞతలు.. అని పేర్కొన్నారు మడోన్నా.
అంతేకాకుండా కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటానికి మడోన్నా మద్దతు పలికారు. వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి సుమారు 8 బిలియన్ డాలర్ల మేర నిధులను సేకరించ గలిచారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారీకి నిధులు అందించడంపై మడోన్నా స్పందిస్తూ.. ఇలాంటి పరిశోధనలో తాను భాగం కావడం గర్వంగా ఉంది. తన గురించి మీడియాలో సెన్సేషనల్ హెడ్డింగులు పెట్టేవారు కరోనా వైరస్ లక్షణాల గురించి కాస్త రీసెర్చ్ చేస్తే బాగుంటుందేమో అంటూ కామెంట్ చేసారు. ఈ ప్రాణాంతక వ్యాధిని తరిమి కొట్టేందుకు చేపట్టిన చర్యలతో ఆమెపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.