సినిమాలో ఒక పాట బావుంది అంటే ఆ సినిమా కంపోస్ చేసిన వారికంటే పాడిన వారికే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆదరణ దక్కుతోంది. పాత్రకు అనుగుణంగా గాత్రంతో వారు చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ప్రస్తుత రోజుల్లో కొన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా అందులో ఉండే పాటలు మాత్రం జనాలను ఉర్రూతలూగిస్తున్నాయి.
ఇక ఐటెమ్ సాంగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింగర్స్ స్పైసి గాత్రంతో కేక పుట్టిస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం టైటిల్ సాంగ్స్ లో కూడా ఓ గాయని అలరిస్తోంది. కర్నూల్ కి చెందిన ఉమ నేహా అనే యువతి రీసెంట్ గా బాలయ్య - పైసా వసూల్ సినిమాలో టైటిల్ ట్రాక్ పాడింది. సాంగ్ మంచి హిట్ అయ్యింది. దీంతో బాలయ్య ఎక్కడికి వెళ్లినా ఈ పాటను హమ్ చేస్తున్నారని అంటోంది నేహా. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పైసా వసూల్ సినిమాలో తనే ముస్కన్ సేతి పాత్రకు డబ్బింగ్ చెప్పిందట నేహా. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే.. పూరి జగన్నాథ్ నా గత్రాన్ని చాలా ఇష్టపడతారని టెంపర్ - జ్యోతి లక్ష్మి సినిమాలో కూడా పాడే అవకాశం ఇచ్చారని చెప్పింది. ఇక ముస్కన్ సేతి కి డబ్బింగ్ కూడా ఆయనే చెప్పామన్నారు అని చెబుతూ మొదటి సారి వేరొక పాత్రకు వాయిస్ ని అందించడం చాలా కొత్తగా అనిపించిందని చెప్పుకొచ్చింది.
తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పూరి గారికి కృతజ్ఞతలు చెప్పింది నేహా. ఫైనల్ గా సినీ జనాలు ఈ సింగర్ కిి ఇపుడు "క్విన్ ఆఫ్ టైటిల్ ట్రాక్స్" అని అభిమానంతో బిరుదు కూడా ఇచ్చేశారు.