ఇల్లు చూస్తానని చెప్పి.. షర్టు లోపల చేయి పెట్టి ఛండాలంగా చేశాడట

Update: 2021-12-25 13:30 GMT
మరో సెలబ్రిటీ తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటకు వెల్లడించి సంచలనంగా మారారు. హాలీవుడ్ సీనియర్ నటుడు క్రిస్ నాత్ పై సింగర్ లీసా జెంథిల్ షాకింగ్ అంశాల్ని వెల్లడించారు. ఇటీవల మరో నలుగురు సెలబ్రిటీలు క్రిస్ పై లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. అతగాడితో తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని వెల్లడించిన అంశాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి.

దాదాపు పద్దెనిమిదేళ్ల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించిన ఆమె మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంతకూ ఆమె ఏం చెప్పారు? ఆమెకు ఎదురైన చేదు అనుభవం ఏమిటి? అన్నది ఆమె మాటల్లోనే చూస్తే..1998లో న్యూయార్క్ లోని రెస్టారెంట్ లో తొలిసారి క్రిస్ ను కలిశాను.

మ్యూజిక్.. బిజినెస్ గురించి మాట్లాడుకునేవాళ్లం. అలా మొదలైన మా పరిచయం పెరిగి పెద్దదైంది. 2002లో ఒక రోజు రాత్రి రెస్టారెంట్ లో కలిశాం. అనంతరం ఇంటి దగ్గర దింపుతానని చెప్పాడు. సరేనని చెప్పటంతో డ్రాప్ చేశాడు. ఇంటిని చూస్తానని ఇంట్లోకి వచ్చాడు. అందుకు ఓకే చెప్పాక.. ఇంట్లోకి వచ్చినంతనే బలవంతంగా దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టాడు. అసభ్యంగా వ్యవహరించాడు.

నాకు ఇష్టం లేదని అతడికి చెబుతూనే ఉన్నా. కానీ.. వినలేదు. నా షర్టులోపల చేతులు పెట్టేసి దారుణంగా వ్యవహరించాడు. పట్టరాని కోపంతో అతన్ని బలవంతంగా వెనక్కి తోసేశాను. నాకు ఇదంతా ఇష్టం ఉండదని గట్టిగా అరిచి చెప్పాను. దీంతో.. క్రిస్ నన్ను బండ బూతులు తిడుతూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం గురించి ఎక్కడైనా చెబితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానన్నాడు. దీంతో.. నా కెరీర్ ఎక్కడ నాశనం అవుతుందన్న భయంతో ఎక్కడా మాట్లాడలేదు.

తాజాగా నలుగురు సెలబ్రిటీలు ధైర్యంగా బయటకు వచ్చి క్రిస్ తమను లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పటంతో.. సింగర్ లీసా.. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. ఇక.. క్రిస్ మాత్రం తనపై చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని లైంగిక ఆరోపణల్ని కొట్టివేశారు.


Tags:    

Similar News