సింగర్ సునీత తన 'సెకండ్ లైఫ్'ను అద్భుతంగా లీడ్ చేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త.. మ్యాంగో అధినేత రామ్‌ను సునీత ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తమ ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందో కూడా లేటెస్ట్ గా రివీల్ చేశారు ఈ దంపతులు. సుమ యాంకర్ గా వ్యవహరించిన ఇంటర్వ్యూలో.. తమ మధ్య ప్రేమ చిగురించడం మొదలు.. భార్యాభర్తలుగా మారే వరకూ అన్ని విషయాలనూ పంచుకున్నారు. అయితే.. ఈ జంట ఇప్పుడు మాల్దీవుల్లో హనీమూన్ వెకేషన్ లో ఉంది. ఈ సందర్భంగా సునీత చేసిన పని హాట్ టాపిక్ గా మారింది.
మొదటి భర్తతో దూరమైన సునీత చాలా కాలం ఒంటరిగానే ఉన్నారు. తన ఇద్దరు పిల్లలను ఒక్కరే పెంచి పెద్దచేశారు. ఈ క్రమంలోనే రామ్ పరిచయం అయ్యాడట. అయితే.. అప్పుడప్పుడూ రామ్ తో ఫోన్లో మాట్లాడేదాన్నని చెప్పిన సునీత.. ఆయన తరచూ 'ఇంకేంటీ..?' అని అడిగేవాడని చెప్పింది. అయితే.. ఆ మాటల్లో అర్థాన్ని అప్పుడు గుర్తించలేకపోయానని చెప్పింది సునీత.
ఆ తర్వాత అసలు విషయం గుర్తించి, ఫోన్ లిఫ్ట్ చేసేదాన్ని కాదని కూడా తెలిపింది. అందుకు కారణం.. అసలు తనకు పెళ్లంటేనే ఇష్టం లేకపోవడమేనని చెప్పింది సునీత. ఆ తర్వాత లాక్ డౌన్ లో ఏదో జరిగిందన్న సింగర్.. రామ్ ఫోన్ చేసి, ఫోన్లోనే పెళ్లి గురించి ప్రపోజ్ చేశారని వెల్లడించింది. ఆ తర్వాత పిల్లలతోపాటు కుటుంబ పెద్దలు కలిసి ఆమెకు రెండో పెళ్లి చేసిన విషయం తెలిసిందే.
అయితే.. పెళ్లి తర్వాత వారు హనీమూన్ కు వెళ్లలేదు. ఎప్పుడు అని అడిగితే.. తర్వాత ప్లాన్ చేస్తామని చెప్పింది సునీత. అయితే.. ప్రేమికుల దినోత్సవాన హనీమూన్ వెకేషన్ ప్లాన్ చేసిందీ జంట. ఇప్పుడు మాల్దీవుల్లో సందడి చేస్తున్నారు సునీతారామ్. అక్కడ తాను దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా.. అక్కడ తనకిష్టమైన పనిచేశారు సునీత. తన జీవితం సరికొత్త రెక్కలు తొడుక్కున్న వేళ.. సముద్రపు అంచుల్లో నిలబడి గొంతు విప్పారు. సముద్ర తీరాన మధుర గీతాన్ని ఆలపించారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఆ పాటను కూడా షేర్ చేశారు. పెళ్లి తర్వాత ఆమె పాడిన తొలిపాట ఇదే. దీంతో.. ఈ సాంగ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తన జీవితం ఎంత ఆనందంగా ఉందో ఈ పాట ద్వారానే తెలుస్తోందని అంటున్నారు ఫ్యాన్స్. ఎంజాయ్ హనీమూన్ వెకేషన్ అని కామెంట్ చేస్తున్నారు.