న్యూ ఇయర్.. న్యూ మూవీస్.. రకుల్ బౌన్స్ బ్యాక్?
అయితే రకుల్.. తెలుగు సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చేసింది. మూడేళ్లు దాటిపోయింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏలిన ముద్దుగుమ్మ తన యాక్టింగ్ తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. దాదాపు తెలుగులో అందరి స్టార్ హీరోలతో నటించి మెప్పించారు. బాక్సాఫీస్ వద్ద అనేక హిట్స్ అందుకుని సత్తా చాటారు రకుల్.
అయితే రకుల్.. తెలుగు సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చేసింది. మూడేళ్లు దాటిపోయింది. చివరగా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొండపొలం మూవీలో కనిపించారు. ఆ తర్వాత ఒక్క తెలుగు చిత్రంలో కూడా సందడి చేయలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా గడుపుతూ వరుస చిత్రాలు చేస్తున్నారు.
కానీ 2024లో రకుల్.. తన సినిమాలతో మెప్పించలేకపోయారు. అటు నార్త్.. ఇటు సౌత్.. ఎక్కడా కూడా ఆమె సౌండ్ వినిపించలేదు. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు-2 మూవీతో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్న స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు.
కోలీవుడ్ మూవీ అయలాన్ కూడా నిరాశపరిచింది. అయితే ఆ రెండు సినిమాలు కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా.. అనేక కారణాల వల్ల వాయిదా పడ్డాయి. చివరకు 2024లో రిలీజ్ అయ్యాయి. కానీ రకుల్ కు నిరాశ ఎదురయ్యేలా చేశాయి. అయితే ప్రస్తుతం నార్త్ లో మూడు సినిమాల్లో నటిస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్.
దే దే ప్యార్ దే 2, మేరీ హస్బెండ్ కీ బీవీ, అమీరీ సినిమాల్లో రకుల్ నటిస్తుండగా.. ఆ చిత్రాల్లో ఆమె రోల్స్ చాలా కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ మూడు సినిమాలు కూడా 2025లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే సమయంలో సౌత్ లో ఆమె యాక్ట్ చేసిన భారతీయుడు-3.. విడుదలకు సిద్ధంగా ఉంది.
ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చినా.. రీసెంట్ గా థియేటర్లలోనే భారతీయుడు-3 విడుదల అవుతుందని శంకర్ క్లారిటీ ఇచ్చారు. 2025లోనే రిలీజ్ కానుంది ఆ చిత్రం కూడా. అలా కొత్త ఏడాదిలో రకుల్ ప్రీత్ సింగ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మంచి హిట్స్ అందుకోవాలని తహతహలాడుతున్నారు. మరి రకుల్ కొత్త చిత్రాలు ఎలా ఉంటాయో? ఆమె ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.