‘సింగర్ సునీత’. తెలుగోళ్లకు పరిచయం చేయాల్సిన పని లేదు. తేనెలాంటి స్వరం ఆమె సొంతం. తన స్వరంతో కోట్లాది మంది మనసుల్ని గెలుచుకున్న ఆమె.. తన అందంతో మరెంతోమందిని అభిమానుల్ని చేసుకుంది. అలాంటి సునీతకు 19 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజా? అంటే అలాంటిదే అని చెబుతారు. అయితే.. ఆమె వైవాహిక జీవితం ట్రబుల్స్ లో ఉందని.. భర్తతో బ్రేకప్ చెప్పుకున్నారంటూ వస్తున్న వార్తలకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఆమె గురించి చాలామంది రూమర్స్ గా ప్రచారం చేసే విషయాల మీద ఒక ప్రముఖ తెలుగు మీడియా సంస్థకు ఆమె సంచలన ఇంటర్వ్యూ ఇచ్చారు.
తన గురించి.. తన జీవితం గురించి ఓపెన్ గా చెప్పిన ఆమె ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ సెలబ్రిటీ కూడా ఇంత ఓపెన్ గా తన పర్సనల్ విషయాల్ని వెల్లడించలేదేమో? తనకు గాయమైందని.. అది మానని గాయంగా మారిందని.. ఇది గాయని గాయంగా ఆమె పేర్కొన్నారు. తన భర్తతో తాను బ్రేకప్ అయ్యాను కానీ విడాకులు తీసుకోలేదని.. విడాకులు ఇవ్వమంటే ఇవ్వటం లేదని చెబుతున్నారు. మోసం చేసే లక్షణం ఉండటం వల్లే తన భర్తను దూరం పెట్టాల్సి వచ్చిందని చెప్పిన ఆమె.. తాను విడాకులు తీసుకున్నానని అనుకుంటారు కానీ అది నిజం కాదని.. తాము విడి విడిగా ఉంటున్నామని చెప్పుకొచ్చారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలోని వ్యాఖ్యల్ని ఆమె మాటల్లోనే చూస్తే..
19 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నాకు 37 ఏళ్లు. మెంటల్ గా మెచ్యూరిటీ లేని టైమ్ లో పెళ్లి చేసుకున్నా.. జీవితం అంటే ఏంటో కూడా అవగాహన లేదనప్పుడు. చాలామంది ఆనందంగా కనిపిస్తున్న వారిని చూసి అంతా ఓకే అనుకుంటారు. కానీ.. ఎన్నో సర్దుబాట్లు.. మరెన్నో త్యాగాలు చేస్తేనే.. ఇద్దరు వ్యక్తులు కలిసి హ్యాపీగా ఉంటారు. అందరిని అనని కానీ కొన్ని జంటల పరిస్థితి మాత్రం ఇదే. మా పిల్లలకు మంచి జీవితం ఇవ్వటం కోసం పదేళ్లకు పైనే రాజీ పడ్డాను. ఎన్నో త్యాగాలు చేశాను.
జీవితభాగస్వామిగా భర్తను నమ్మాలి. నమ్మాను. అవతలి వ్యక్తి తప్పులు చేసి.. వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఊరుకోగలమా? ఎవరినైనా భరించొచ్చు కానీ పక్కనే ఉంటూ మోసం చేస్తూనే.. బయటేమో అమ్మా.. బుజ్జి.. కన్నా.. అంటూ మాట్లాడేవాళ్లని భరించలేం. ‘హి చీటెడ్ మి’. తన కంటే దేవత ఈ ప్రపంచంలో లేదని చెప్తాడు. నా అవసరం తనకుంది. విడిపోవాలనుకున్న విషయం గురించి పిల్లలతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేకుండా ఎవరేంటి? ఎవరేం చేస్తున్నారు? అన్నది వాళ్లు చూశారు. నేను చేసిన మంచి పనేమిటంటే.. ఎదుటి వ్యక్తి గురించి పిల్లల దగ్గర చెడుగా చెప్పలేదు. ఎవరంతట వాళ్లు తెలుసుకోవాలని నేను నమ్ముతాను.
సునీత భర్త కాకపోతే అతనికి బయట ఐడెంటిటీ లేదు. సునీత చాలా కష్టాల్లో ఉంది. అడగలేకపోతోంది.. కూతురికి ఏదో అవసరం వచ్చింది అని నా పేరు వాడుకోకపోతే డబ్బులు ఎవరిస్తారు? పిల్లలకు తల్లి.. తండ్రి అన్న తేడా లేకుండా పెంచానని గర్వంగా చెప్పగలను. ఇప్పుడు నా కొడుకు ఇండియాలో మంచి యూనివర్సిటీలో చదువుతున్నాడు. తల్లిగా నాకోగర్వం. వాళ్లకు ఓమంచి జీవితాన్ని ఇస్తున్నా. అంతకంటే ఏం కావాలి?
వాళ్ల నాన్న ప్రభావమో.. మరొకటో.. వాడికి సినిమాల్లో రావాలనుంది. పీజీ వరకూ చదివిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని చెప్పా. ఏది మంచి.. ఏది చెడు అన్న విషయాలపై వాడికి అప్పటికి ఒక స్పష్టత వచ్చేస్తుంది కదా. విడాకులు ఇవ్వమని ఎంత కావాలని అడిగినా ఇవ్వడు. నా దృష్టిలో భార్య పిల్లల పట్ల బాధ్యతగా లేనివాడు క్యారెక్టర్ లెస్ ఫెలోనే. ఈ రోజుకీ నా కొడుకు ఏ యూనివర్సిటీలో చదువుతాడో అతనికి తెలీదు. తెలుసుకోవాలని అనుకోడు. అంత నిర్లక్ష్యం.
అతను (భర్త) గురించి ఒకప్పుడైతే చెప్పేదాన్ని కాదేమో. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నానంటే.. నా సహననాన్ని పీక్స్ లో పరీక్షించాడు. ఎవరికీ తెలీకుండా ఎంత ఏడ్చానో నాకే తెలుసు (కన్నీరు ఉబికి వస్తుండగా) ‘తిన్నావా.. ఏ సినిమా చూశావ్? ఎలా ఉన్నావ్ అని కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆర్థికంగా కాకున్నా పిల్లాడికి ఏ కాలేజ్ మంచిది? ఏం చేస్తే మంచిది? లాంటి విషయాల్ని మాత్రం పట్టించుకోడు.
సెలబ్రటీలకు.. అందునా అందమైన సెలబ్రిటీల గురించి చాలానే మాటలు ప్రచారంలో ఉంటాయి. పెళ్లి అయినా.. కాకున్నా.. వాళ్లతో లింకు ఉందని.. వీళ్లతో లింకు ఉందని రాసేస్తుంటారు. నిజంగా ఉందా? లేదా? అన్నది ఎవరూ క్రాస్ చెక్ చేసుకోవటం ఉంది. నిజానికి ఇలాంటి వాటి గురించి సెలబ్రిటీలు క్లియర్ గా.. ఓపెన్ గా మాట్లాడే ధైర్యం చేయరు. కానీ.. సింగర్ సునీత మాత్రం అందుకు భిన్నంగా ఓపెన్ గా మాట్లాడేశారు. పొలిటీషియన్ తో ఆమెకు అఫైర్ ఉందని కొందరు.. మళ్లీ అంతలోనే.. ఈ మధ్యనే ఆమె ఎవరినో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని ఇంకొందరు.. లేదు.. లేదు.. పెళ్లి చేసుకోబోతున్నారని మరికొందరు చాలానే చెబుతారు. మరి. . ఇలాంటి విషయాల మీద సునీతే స్వయంగా ఓపెన్ అయ్యారు.
పొలిటీషియన్ తో ఎవరికి శత్రుత్వం ఉందో నాకు తెలీదు. దానికి నేను బలయ్యా. ఓ బ్యూటిఫుల్ సింగర్ తో ఆయనకేదో ఉందని వార్తలు రాయటం మొదలుపెట్టారు. ఉన్న బ్యూటిపుల్ సింగర్స్ లో నేనూ ఒకదాన్న కావటంతో చాలామంది నా పేరు ఫిక్స్ చేసేశారు. అదెంత అన్యాయమో చెప్పండి. నా పక్కన బలమైన వ్యక్తి ఉండి ఉంటే ఇలాంటి రూమర్స్ వస్తాయా? లేకపోవటంతో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు అన్నట్లు అయిపోయింది. భర్త ఎలా ఉన్నా సర్దుకుపోయి ఉంటే సునీత గ్రేట్ అని గొప్పగా మాట్లాడుకునేవారు. లింకప్ రూమర్స్ వచ్చి ఉండేవి కావు.
నన్ను ఎమోషనల్ గా టార్చర్ చేసిన వాళ్లు చాలామందే ఉన్నారు. నా వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యల కారణంగా చాలా అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత వాళ్లంతట వాళ్లే తెలుసుకొని .. మేం తప్పు చేశాం.. సారీ అని చెప్పి అవకాశాలు ఇస్తున్నారు. నాతో పరిచయం లేని వాళ్లు నా గురించి ఏవేవో మాట్లాడతారు. పరిచయం అయ్యాక మీరింత మంచి మనిషి అనుకోలేదంటారు.
మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు. అందరూ నా ఎమోషన్స్ ను అర్థం చేసుకునేవాళ్లే. అందుకే.. నాకు మళ్లీ పెళ్లి చేసుకునే అవసరం కనిపించలేదు. విడిపోయిన తర్వాత అతని (భర్త) తాలూకు వాళ్లు నాతో లేరు. అందుకేనేమో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రావటం.. పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు రావటం వస్తున్నాయేమో. నాతో.. నా పిల్లలు.. అమ్మా.. నాన్న.. నానమ్మ అంతా మనుషులే. ఇల్లీగల్ రిలేషన్ షిప్ పెట్టుకోవాలనుకునేవారు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. నా ఇంటికి వచ్చి నా చుట్టూ ఉన్న మనుషులను చూసిన తర్వాత.. ఈవిడగార్ని పెళ్లి చేసుకుంటే మన పరిస్థితి ఇంతేనని అనుకోని వాళ్లు ఉండరు.
ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారన్న పేరు అతడి (భర్త కిరణ్)కారణంగానే వచ్చింది. పైసా అప్పు చేసే అలవాటు లేదు. ఉంటే తింటాను. లేకపోతే లేదు. నా డిగ్నిటీని వదులుకొనే పనులు ఏ రోజూ చేయలేదు.. చేయను. సునీత ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో ఉందని చెప్పి.. నా క్యారెక్టర్ బ్యాడ్ చేశాడు. సునీత ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది.. తినటానికి తిండి లేదు.. వారం రోజులుగా హాస్పిటల్ లో ఉన్నాను.. ఎవ్వరూ పట్టించుకోవటం లేదని చెప్పుకున్నవాడు విడాకులు ఎందుకు ఇవ్వటం లేదు?
ఈ మధ్యనే అతనితో మాట్లాడా. డబ్బుల గురించి వదిలెయ్. బాధ్యత తీసుకో. పిల్లాడు పెద్ద చదువులకు వెళుతున్నాడు.. గెడైన్స్ ఇవ్వమన్నా. నాకంటే నీకు బాగా తెలుసు కదమ్మా అన్నాడు. తప్పించుకునే తత్వం అది. ఏ భార్య అయినా భర్త నుంచి కోరుకునేది.. నీకు నేను ఉన్నానన్న నమ్మకం. పక్కన ఉంటూనే దారుణంగా మోసం చేశాడు. ఏ మనిషికైనా మారటానికి కాస్త టైం ఇవ్వాలి. ఇప్పటికే ఎక్కువ టైం ఇచ్చి చూశాను కానీ ఇప్పుడు అతని గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నా.