ఇటీవల సింగర్ సునీత వార్తల్లో నిలిచినంతగా.. మరే సెలబ్రిటీ నిలవలేదు. ఆమె సెకండ్ మ్యారేజ్ పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ సాగింది. కొందరు ఆమె వివాహాన్ని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. ఈ డిస్కషన్ ఇటు కొనసాగుతుండగానే.. అటు ప్రశాంతంగా ఆమె పెళ్లి జరిగింది.
రామ్ వీరపనేనితో సునీత వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి అతి కొద్ది మంది సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. నితిన్, సుమ, రేణూ దేశాయ్, దిల్ రాజు వంటి వారు కొందరు ఆ వేడుకలో పాల్గొన్నారు. సునీతకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అయితే.. పెళ్లి తర్వాత కూడా సునీత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. జీవితం ఎంతో ఆనందంగా ఉందంటూ మంచి మంచి కొటేషన్లు చెబుతోంది. తన లేటెస్ట్ పిక్స్ మరిన్ని షేర్ చేసింది. ఈ ఫొటోలతోపాటు వీటికి ఆమె రాసిన క్యాప్షన్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
కొత్త జీవితం చాలా ఆనందంగా ఉందన్న విషయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా.. కాఫీ తాగుతున్న ఫొటోను షేర్ చేసిన సునీత.. ఇంటి గార్డెన్‌లో మొక్కల మధ్య నడుస్తున్న ఫొటోలు కూడా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయి. వీటికి మంచి క్యాప్షన్ కూడా రాశారు. 'సంతోషంగా ఉండేందుకు.. మంచి పనులు చేసేందుకు.. ఆలస్యం చేయడమనేదే ఉండదు' అంటూ రాసుకొచ్చారు సునీత.