టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ ఇలా అన్ని తరహా భాషల్లో పాటలు పాడి మెప్పించిన గాయని సునీత. అంతే కాకుండా అగ్ర సంగీత దర్శకుల బాణీలకు తన గాత్రాన్ని అందించి ఎంతోమంది ప్రేక్షకులను పరవశింపజేశారు. ప్రస్తుతం ఆమె పాటలు ఎక్కువగా రాకపోతున్నా అప్పుడప్పుడు ప్రయోగాత్మకమైన కష్టతరమైన రాగలకు ఈ కోయిలమ్మనే ఎంచుకుంటున్నారు సంగీత దర్శకులు.
ఒక గాయనిగానే కాకుండా సునీత గారు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సున్నితమైన గొంతుతో ఎంతో మంది హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు. సినీ జీవితంలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత.. పలు సామాజిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీల స్వేచ్చా హక్కుపై ఆమె సమయం వచ్చినప్పుడు తనదైన శైలిలో ప్రసంగాన్ని ఇస్తుంటారు. అయితే రీసెంట్ గా సునీత హైదరాబాద్ నగరంలో పోలీసు శాఖ నిర్వహించిన చైతన్య కార్యక్రమంలో పాల్గొన్నారు. జాగో బదలో బోలో’ పేరిట ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆమె మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై మాట్లాడారు.
ఇక నుంచి అమ్మాయిలు ఇలాంటి దారుణాలను ఎదుర్కోవాలని చెబుతూ.. లైంగిక వేధింపులకు గురైతే ధైర్యంగా బయటకు చెప్పాలి. ఎక్కువగా చిన్నారులు ఇలాంటి దారుణాలు జరిగితే.. బయటకి చెప్పడానికి రాలేకపోతున్నారు. అందుకు కారణం భయం సిగ్గు అలాగే పరువు ప్రతిష్టలు. ఇక నుంచి వాటిని పట్టించుకోవద్దని ధైర్యంగా ముందుకు సాగాలని బదులిచ్చారు. అంతే కాకుండా చిన్నారులపై జరుగుతున్న లైంగిక దారుణాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గళం విప్పాలని సునీత తెలిపారు. అనంతరం హిందీలో ఒక మంచి పాట పాడి అందరిలో ఉత్తేజాన్ని నింపారు.