కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్న విలక్షణ నటుడు.. ఇప్పుడు ''సార్'' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో ''సార్'' మూవీ తెరకెక్కుతోంది. దీనికి తమిళ్ లో 'వాతి' అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది.
రేపు ధనుష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు బుధవారం 'సార్' ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఇందులో ధనుష్ ఒక లైబ్రరీలో కూర్చొని టేబుల్ ల్యాంప్ వెలుతురులో తీవ్రంగా అధ్యయనం చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ధనుష్ ఈ సినిమాలో ఒక లెక్చరర్ గా నటిస్తున్నట్లు ఈ ఫస్ట్ లుక్ సూచిస్తుంది. ఇందులో అతను భిన్నమైన లుక్ లో ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. హాఫ్ హ్యాండ్ షర్ట్ లో బైసెప్స్ ను గమనిస్తే.. ఇందులో అతను సార్ కావడం కంటే ఏదో ఎక్కువ ఉంటుందని అర్థం అవుతోంది.
'సార్' సినిమా దేశంలోని విద్యావ్యవస్థ గురించి చర్చిస్తుందని టాక్ ఉంది. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. రేపు సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యే టీజర్ తో దీనిపై స్పష్టత వస్తుందేమో చూడాలి.
'సార్' చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రూపొందిస్తోంది. శ్రీకర స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ ఈ బైలింగ్విల్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.