డ్రగ్స్ విషయంలో ఛార్మిని సిట్ అధికారులు నిన్ననే ప్రశ్నించారు. కొన్ని గంటలపాటు ఆమెపై ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించి సుదీర్ఘ విచారణ చేపట్టారు. కేసులో ఛార్మి చెప్పే విషయాలే కీలకం కానున్నాయని ప్రచారం జరిగింది. మరి ఆమె విచారణలో ఏం చెప్పిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ విషయంపై చాలా డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. మీడియా వర్గాలు భిన్నమైన కథనాల్ని బయటపెడుతుండడమే అందుకు కారణం. ప్రధాన పత్రికలు పొంతన లేకుండా వార్తల్ని ప్రచురించాయి. ఒక పత్రికలోనేమో ఛార్మి కీలక సమాచారం బయటపెట్టిందని రాయగా, మరొక పత్రికలోనేమో ఛార్మి ముక్తసరిగా సమాధానం ఇచ్చిందని, ఆమె తీరు పట్ల విచారణ అధికారులు నిరాశని వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చాయి. పైగా విచారణకి వెళ్లేటప్పుడు ఛార్మి భయం భయంగా వెళ్లిందనీ... వచ్చేటప్పుడు హుషారుగా వచ్చిందని వార్తలు వెలువడ్డాయి.
ఈ వార్తల్నిబట్టి ఛార్మి నుంచి విచారణాధికారులు సరైన సమాచారం రాబట్టలేకపోయారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఛార్మి వ్యక్తిగతంగా గడసరి అమ్మాయి. ఆమె ఎక్కడైనా డేరింగ్ అండ్ డాషింగ్ గా వ్యవహరిస్తుంటుంది. నిన్న విచారణలో కూడా డేరింగ్ గా ఉంటూ.. కొన్ని విషయాల్ని అస్సలు బయటపెట్టలేదని, అవి పర్సనల్ విషయాలనీ, వాటిని మీకెందుకు చెప్పాలని అధికారుల్ని ఆమె గట్టిగా ప్రశ్నించినట్టు వార్తలొచ్చాయి. నిన్న విచారణకి కోర్టు ఆదేశాల మేరకు మహిళా అధికారుల్ని నియమించారు. అది ఛార్మికి బాగా కలిసొచ్చిందని ఫిల్మ్ నగర్ లో మాట్లాడుకుంటున్నాయి. మొత్తంగా కీలకమైన ఛార్మి విచారణ విషయంలో ఎలాంటి సమాచారం బయటికొంచ్చిందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.