ఇప్పుడు సినిమా పేర్ల చుట్టూతానే కాకుండా ఏకంగా షార్ట్ ఫిలింస్ పేర్లపై కూడా నానా రభసా జరుగుతోంది. ఒక ప్రక్కన దేశంలో 'అహల్య' అంటూ షార్ట్ ఫిలిం పెట్టేసి ఒక సెక్సీ స్టోరీని చూపించినుందుకే నెటిజన్లు రభస చేస్తే.. ఇప్పుడు ఏకంగా ఒక డైరక్టర్ తన షార్ట్ ఫిలింకు ''సీత.. ఐ యామ్ నాట్ వర్జిన్'' అనే పెరెట్టేశాడు. దానితో పిచ్చి పీక్స్ కు వెళిపోయింది.. ఏకంగా పోలీసు కేసుకు దారితీసింది.
కౌశిక్ అనే తెలుగు కుర్రాడు.. యుట్యూబ్ డ్యాన్సులు మరియు డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన దీప్తి సునయన.. డ్యాన్సర్ షణ్ముఖ్ లను ముఖ్య పాత్రదారులుగా పెట్టేసి ''సీత.. ఐ యామ్ నాట్ వర్జిన్'' అనే షార్ట్ ఫిలిం తీశాడు. సొసైటీలో జరుగుతున్న మానభంగాలపై సందించిన బ్రహ్మాస్ర్తం ఇదే అంటూ చెప్పుకొస్తున్నారు నిర్మాతలు. అయితే అసలు సాక్షాత్తూ దేవతగా హిందువులు పూజించే సీతమ్మ తల్లిపై పేరుతో ఇలా వర్జిన్ అంటూ టైటిల్ పెడితే సహించేది లేదంటూ.. ప్రసూన అనే ఒక మహిళ నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోయింది.
ఇదే విషయంపై స్పందించిన కౌశిక్.. తాను సీతమ్మ దేవి లేదా సీతమ్మ తల్లి అని టైటిల్ పెడితే అది రామాయణంలోని పాత్రను అవమానించినట్లు కాని.. స్వతాహా హిందువే అయిన తాను అసలు ఏ మహిళనూ కించపరచలేదని.. కేవలం మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే వేలెత్తి చూపానని అంటున్నాడు. ఏదేమైనా కూడా.. టోటల్ యవ్వారం.. ఇప్పడు యుట్యూబ్ కు ప్రచారంగా లభిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/