ఇంట్లో వద్దు.. థియేటర్ లోనే సీతారామం చూడమంటున్నారట

Update: 2022-08-09 01:30 GMT
భారీ బడ్జెట్.. అందుకు తగ్గట్లే అంచనాల మధ్య విడుదలయ్యే సినిమాకు.. అంచనాలు పెద్దగా లేకుండా ఉన్నప్పటికీ.. ప్రయత్నం లోపం అంటూ లేని రీతిలో సినిమా ఉండాలన్న పట్టుదలతో రిలీజ్ అయ్యే సినిమాకు మధ్య పొంతన ఉండదు. ఇప్పుడా విషయం దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం మూవీతో మరోసారి ఫ్రూవ్ అయ్యింది.

మితిమీరిన ఆత్మవిశ్వాసంతో హడావుడిగా హోంవర్కు చేసే తెలివైన కుర్రాడి కంటే.. ఒద్దికగా ఉంటూ.. హోం వర్కు పక్కాగా చేసుకొని ఏ మాత్రం తప్పులు ఉండకూడదన్న పట్టుదలతో ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకున్న తర్వాత స్కూల్ కు వెళ్లే పిల్లాడికి అస్సలు పొంతన ఉండదు. తాజాగా విడుదలైన సీతా రామం స్టోరీ కోవలోకే వస్తుంది.

నిజమే.. టాలీవుడ్ లో ఇన్ని ట్విస్టులతో కూడిన చిక్కనైన ప్రేమకథ ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ లవ్ స్టోరీ చూస్తున్నంత సేపు అందులో మమేకం కావాల్సిందే. ప్రేమించిన అమ్మాయిని సైతం మర్యాదగా పిలుస్తూ.. పూర్తిగా తనదవుతుందన్న నమ్మకం వేళలోనే ఆట పట్టించేలా చనువుగా.. కొంటెగా పిలిచే పిలుపులు.. దూరంగా ఉన్నప్పుడు దూకుడుగా.. దగ్గరగా ఉన్నప్పుడు ముడుచుకుపోయే హీరోయిన్ పాత్రను చూసినప్పుడు ఇలాంటి పాత్రను డిజైన్ చేయటానికి ఎంత సున్నితత్త్వం.. మరెంత టేస్టు ఉండాలన్న భావన కలుగక మానదు.

ఎమోషనల్ కనెక్టు అయ్యేలా సినిమాను తయారు చేసిన వైనం.. సినిమా మొదలైన తర్వాత నుంచి అంతకంతకూ సినిమా మీద ఆసక్తి.. అంతకు మించిన అనురక్తి పెరిగిపోయేలా సినిమాను తీయటం అందరికి సాధ్యం కాదు. ఈ కారణాలే సీతా రామం ప్రేక్షకులకు మరెంతగా కనెక్టు కావటానికి కారణమైందని చెప్పాలి.

అందుకే.. ఓటీటీని వదిలేసి.. దాని రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా బాగా తీసిన సినిమాను థియేటర్ లో మాత్రమే చూస్తే ఆ ఫీల్.. థ్రిల్ వేరుగా ఉంటుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ కనిపించనట్లుగా.

ఈ సినిమా గురించి మౌత్ టాక్ బాగుందన్న మాటతో పాటు.. ఇంట్లో కాదు.. సినిమా థియేటర్ లోనే చూడాలి.. అప్పుడు మాత్రమే ఫీల్ లభిస్తోందంటూ పెద్ద ఎత్తున ఈ మూవీ 'ఆర్మీ' చెబుతున్న వైనం చూస్తే.. సీతా రామం లాంటి సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయి. అలాంటి వాటిని మరోఆలోచన లేకుండా ఆదరించేయటమే మంచిది. ఆ విషయంలో శషబిషలు అస్సలు అక్కర్లేదు.
Tags:    

Similar News