గ్రేట్ హెయిర్ డే.. సీతా పాప హెయిర్ క‌ట్ న‌చ్చిందా?

Update: 2021-06-09 06:30 GMT
సితార ఘ‌ట్ట‌మ‌నేని .. మ‌హేష్ వార‌సురాలిగానే కాదు.. సోష‌ల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉండే స్టార్ కిడ్ గా ప్రపంచానికి సుప‌రిచితం. సీతా పాప ఇన్ స్టాలో నిరంత‌రం తన వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో పాటు ఇత‌ర విశేషాల్ని వెల్ల‌డిస్తుంది. ఇటీవ‌ల సెసేమ్ వర్క్ షాప్ అనే తెలుగు యూట్యూబ్ ఛానల్ తన మొదటి ఒరిజినల్ సిరీస్ `టాకింగ్ ఎబౌట్ టాకింగ్స్` తో ముందుకు రాగా సితార త‌న స్నేహితురాలు ఆద్య క‌లిసి ర‌న్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఇక‌పోతే సితార తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ ఫోటోని షేర్ చేసింది. గ్రేట్ హెయిర్ డే!  ల‌వ్ మై న్యూ హెయిర్ క‌ట్.. మీకు న‌చ్చిందా? అంటూ ప్ర‌శ్నించింది. దీనికి అభిమానుల నుంచి ల‌వ్ ఈమోజీలు కురుస్తున్నాయి. వావ్ లుకింగ్ సో క్యూట్! అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

నిజంగానే ఈ కొత్త హెయిర్ స్టైల్లో సితార ఎంతో క్యూట్ గా క‌నిపిస్తోంది. ఆ క‌ర్లీ హెయిర్ ఫ్రీస్టైల్లో ఎంతో ల‌వ్ లీగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. మ‌హేష్ స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న గారాట ప‌ట్టీలు సితార గౌత‌మ్ ల‌తో ఇంట్లో నే టైమ్ స్పెండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News