సీతారామంతో ఈవారం కూడా సందడే సందడి

Update: 2022-09-07 11:30 GMT
ప్రతి శుక్రవారం ప్రతి భాషలో కూడా ఒకటి లేదా రెండు అంతకు మించి సినిమా లు విడుదల అవ్వడం జరుగుతూనే ఉంది. థియేట్రికల్‌ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసే సినిమాలు మాత్రమే కాకుండా ఓటీటీ ద్వారా కూడా ఫుల్‌ ఎంటర్ టైన్మెంట్‌ ను అందించేందుకు ఎన్నో సినిమాలు డిజిటల్ ఫ్లాట్‌ ఫామ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఈ వారం ఆ వారం అని కాకుండా ప్రతి వారం కూడా ఏదో ఒక ఓటీటీలో లేదా దాదాపు అన్ని ఓటీటీ ల్లో కొత్త కంటెంట్‌ వస్తూనే ఉంటుంది. భాష తో సంబంధం లేకుండా ఎంటర్‌ టైన్మెంట్‌ ను పొందాలనుకునే వారికి వారానికి సరిపడ కంటెంట్‌ ఉంటుంది. ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు మస్త్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందించేందుకు సిద్ధంగా పలు సినిమాలు వెబ్‌ సిరీస్‌ లు ఉన్నాయి.

సౌత్‌ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీతారామం సినిమా ఈ వారం స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ వారం స్ట్రీమింగ్‌ కాబోతుంది అనే ప్రకటన వచ్చిన వెంటనే ఎప్పడు చూడాలి అనే విషయమై ప్లాన్ చేసుకుంటున్నారు.

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా రష్మిక మందన్నా కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఒక మీడియం రేంజ్ సినిమా గా మొదలు అయ్యి అనూహ్యంగా దాదాపుగా వంద కోట్ల వసూళ్ల కు చేరువ అయ్యింది. ఇటీవలే హిందీలో డబ్‌ అయ్యి ఉత్తరాదిన థియేటర్ల ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తుంది.

కనుక ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయితే సౌత్‌ ప్రేక్షకుల స్ట్రీమింగ్‌ కి వారం రోజుల పాటు ఇండియాలోనే అత్యధికంగా చూడబడుతున్న ఓటీటీ సినిమా గా సీతారామం నిలిచే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్‌ లో సీతారామం సినిమా స్ట్రీమింగ్‌ కి అన్ని ఏర్పాట్లు సిద్ధం అన్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇక సీతారామం కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆయా భాషల్లో ఆ సినిమాలు మోస్ట్‌ బజ్ క్రియేట్‌ చేసిన సినిమాలు. కనుక ఈ వారం కూడా సినిమాలతో ప్రేక్షకులకు ఓటీటీ లు మస్త్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ ను ఇవ్వబోతున్నాయి.

కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్ లు.. షో ల యొక్క కొత్త ఎపిసోడ్‌ లు.. వెబ్‌ సిరీస్ ల యొక్క కొత్త ఎపిసోడ్‌ లు ఇలా అన్ని కూడా ప్రేక్షకులను మస్త్‌ ఎంటర్‌ టైన్‌ చేయబోతున్నాయి. చూసిన వాళ్లకు చూసినంత అన్నట్లుగా ఓటీటీ లు కంటెంట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిని ఆస్వాదించడమే తరువాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News