కరోనా సమయంలో వచ్చిన సినిమాలే చాలా తక్కువ. అందులో చాలా తక్కువ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను దక్కించుకున్నాయి. కరోనా టైమ్ లో విడుదల అయ్యి ఘన విజయం సాధించిన ఇండియన్ సినిమాల్లో తమిళ చిత్రం డాక్టర్ ఒకటి అనడంలో సందేహం లేదు. దాదాపుగా వంద కోట్ల వసూళ్లు దక్కించుకున్న డాక్టర్ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఓటీటీ లో విడుదల అయిన తర్వాత కూడా డాక్టర్ జోరు కంటిన్యూ అయ్యింది. తమిళ యంగ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమా ఘన విజయంను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాల పై తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. డాక్టర్ గా చేసిన శివ కార్తికేయన్ తన తదుపరి సినిమా డాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
డాన్ అనే టైటిల్ ను ఇటీవలే అధికారికంగా ప్రకటించిన శివ కార్తికేయన్ తాజాగా విడుదల తేదీని ప్రకటించాడు. తమిళంతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను ఒకేసారి మార్చి 25వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. థియేటర్లలో మార్చి 25న కలుద్దాం అంటూ శివ కార్తికేయన్ ట్విట్టర్ ద్వారా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాడు. అయితే అదే రోజున పాన్ ఇండియా భారీ మూవీ మన తెలుగు చిత్రం ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ఆ తేదీన భారీ ఎత్తున విడుదల చేయడం ఖాయం అన్నట్లుగా మేకర్స్ ఈసారి బల్లగుద్ది మరీ ప్రకటించారు. దాంతో విడుదల తేదీ విషయంలో ఈసారి మార్పు ఉండక పోవచ్చు అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.
ఆర్ ఆర్ ఆర్ విడుదల కాబోతున్న రోజునే శివ కార్తికేయన్ డాన్ విడుదల కాబోతున్నట్లుగా ప్రకటన రావడం కాస్త చర్చనీయాంశంగా మారింది. తమిళంలో ఆర్ ఆర్ ఆర్ కు కాస్త ఇది దెబ్బ పడే విషయం కాగా.. డాన్ సినిమా తెలుగు లో అదే రోజు విడుదల అయితే కష్టమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనుక శివ కార్తికేయన్ కాస్త అటు లేదా ఇటుగా వారం రోజులు జరిగితే బెటర్ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో శివ కార్తికేయన్ తెలుగు సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి అయ్యాయి. ఇటీవలే సినిమా షూటింగ్ కు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు అయ్యింది. అతి త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. డాన్ ను మార్చి 25న విడుదల చేస్తే శివ కార్తికేయన్ జాతిరత్నాలు సినిమాను ఇదే ఏడాది చివరి వరకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.