శివకార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు ఫేం అనుదీప్ కెవి కాంబినేషన్ లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా టైటిల్ ని ఖరారు చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి `ప్రిన్స్` అనే టైటిల్ ని లాక్ చేసారు.
తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ లో శివకార్తికేయన్ చేతిలో గ్లోబ్ కనిపిస్తోంది. అతడు వైట్ అండ్ వైట్ లుక్ లో శాంతి దూతలా కనిపించాడు. నేపథ్యంలో వరల్డ్ మ్యాప్ ఆసక్తిని పెంచుతోంది. శాంతికి చిహ్నంగా ఉన్న పావురం కూడా ఇదే పోస్టర్ లో కనిపిస్తోంది.
ఇందులో శివకార్తికేయన్ నిజమైన ప్రిన్స్ లా కనిపించడంతో అతని అభిమానులు ఖుషీ అవుతున్నారు. అతడి ముఖంలో చిరునవ్వుతో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయని చెప్పాలి. వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31న తెలుగు- తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రిన్స్ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
`స్పెషల్ ఆప్స్ 1.5: ది హిమ్మత్ స్టోరీ`లో చివరిసారిగా కనిపించిన ఉక్రేనియన్ నటి మరియా ర్యాబోషప్కా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
అన్నట్టు ప్రిన్స్ టైటిల్ తో తెరకెక్కించిన మహేష్ సినిమా అప్పట్లో ఆశించిన ఫలితాన్ని అందించలేదు. మహేష్ ఎంతో ఎనర్జిటిక్ గా నటించినా కానీ ఫలితం తేడా కొట్టింది. కానీ ఇప్పుడు అలా జరగకుండా శివకార్తికేయన్ పై ఉన్న పాజిటివ్ వైబ్స్ హెల్ప్ అవుతాయనే భావిద్దాం.
ఇక ప్రిన్స్ అనగానే మహేష్ బాబు బిరుదు గుర్తుకు వస్తుంది. టైటిల్ ఆసక్తికరంగా ఉన్నా కానీ మూవీలో కంటెంట్ రేంజు ఆ లెవల్లో వర్కవుట్ కావాల్సి ఉంటుంది. కుదరని పక్షంలో మహేష్ ఫ్యాన్స్ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు.