ఓ రెండు సంవత్సరాల క్రితం.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలలో జరిగిన రసాబాసా అందరికీ తెలిసిందే. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ ఒక ప్యానెల్లో జయసుధ మరో ప్యానెల్లో పోటీ చేసి.. ఒకరిపై ఒకరు పరస్పరం బురద జల్లుకున్నారు. అలాగే వారి ప్యానెల్లో ఉన్న ఇతరులు కూడా చాలా ఘాటైన చెత్తయిన కామెంట్లను కూడా చేశారు. చివరకు రాజేంద్ర ప్రసాద్ గెలచి ప్రెసిడెంట్ అవ్వగా.. ఆయన ప్యానెల్ నుండే శివాజీ రాజా చీఫ్ సెక్రటరీ.. అలాగే జయసుధ ప్యానెల్ నుండి నరేష్ జాయింట్ సెక్రటరీ అయ్యాడు. అయితే వీళ్లందరూ టివిలకు ఎక్కి చేసిన రచ్చ మాత్రం.. అంతా ఇంతా కాదు.
అయితే ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తవ్వడంతో.. వీరందరి పదవీకాలం పూర్తయిపోతోంది. అందుకే ఈసారి ఎలక్షన్లలో ఎటువంటి రసాబసా చోటు చేసుకుంటుందా అని అందరూ అనుకుంటుంటే.. ఇప్పుడు నటులందరూ కలసి షాకిచ్చేశారు. అందరూ కలసి ఎలక్షన్లు లేకుండా ఏకగ్రీవంగా శివాజా రాజాను ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారట. అదే విషయాన్ని నటుడు నరేష్ కూడా అఫీషియల్ గా చెప్పేశాడు. మాకెందుకు ఎలక్షన్లు.. చక్కగా ఒకరితరువాత ఒకరం సేవ చేసుకుంటూ పోతాం అంటున్నారు. హేయ్ వాటే ఛేంజ్.. రెండు సంవత్సరాల క్రితం జరిగిన రచ్చ వీళ్ళకు బాగానే గుణపాఠాలు నేర్పేసినట్లుందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/