రెడ్ లైట్ ఏరియాలు ఎందుకు అవసరం?

Update: 2017-01-17 04:38 GMT
కొన్ని సినిమాలు విడుదలయ్యాక ఆసక్తిని కలిగిస్తే.. మరికొన్ని మాత్రం ఆ సినిమా థీమ్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాంటిదే 'శివప్పు ఎనక్కు పుడిక్కుం' కూడా. రెడ్ లైట్ ఏరియాలు అవసరం అని చెప్పడమే ఈ సినిమా కాన్సెప్ట్. ఇలాంటి వివాదాస్పద అంశాన్ని ఎంచుకోవడానికే చాలా ధైర్యం కావాలి. ఇప్పుడా చిత్రాన్ని రిలీజ్ చేసేవరకూ తీసుకొచ్చేశారు కూడా.

'ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉంది. చెన్నై లాంటి సిటీస్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎంతోమంది జీవనం సాగిస్తున్నారు. జనాభా పెరుగుతున్న కొద్దీ పడుపు వృత్తి కూడా పెరుగుతోంది. సమాజంలో ఇప్పుడు రేప్ సంఘటనలు పెరిగిపోతున్నాయి. వీటికి వ్యతిరేకంగా తెరకెక్కినదే శివప్పు ఎనక్కు పుడిక్కుం' అంటున్నాడు దర్శుకుడు. 'ఒక వేశ్య తన దగ్గరకు ఓ ఐదుగురు వ్యక్తుల మనస్తత్వాలను.. ఒక రచయితకు వివరించడమే ఈ సినిమా' అన్నాడు దర్శకుడు యురేకా.

గతంలో పలు అవార్డు చిత్రాలను అందించిన నిర్మాత జె. సతీష్ కుమార్.. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని నిర్మిస్తున్నాడు. శాండ్రా ఎమీ.. బజార్ బాబు.. రోజా మలర్.. కామాక్షిలు ప్రధాన పాత్రల్లో నటించగా.. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయని దర్శకుడు చెబుతున్నాడు. ఈ నెల 20న విడుదల శివప్పు ఎనక్కు పుడిక్కుం చిత్రాన్ని రిలీజ్ చేస్తామని తెలిపాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News