మాస్ మహారాజా రాకెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో ఆయన మెంటలెక్కిస్తున్నారు. `క్రాక్` బ్లాక్ బస్టర్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన రవితేజ అదే ఊపులో వరుసగా ఆరు చిత్రాలనిలైన్ లో పెట్టేసి ఇండస్ట్రీ వర్గాలకి షాకిచ్చాడు. గతంలో ఇలా స్పీడుని ప్రదర్శించని రవితేజ ఇప్పుడు వరుసగా ఆరు చిత్రాలని బ్యాక్ టు బ్యాక్ లైన్ లో పెట్టడం విశేషం. గత ఏడాది జనవరి 9న విడుదలైన `క్రాక్` రవితేజ చిత్రాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీ సక్సెస్ ఊపులో వున్న రవితేజ ఏకంగా ఇప్పుడు ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు.
రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడీ` చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చే నెల 11న రిలీజ్ కు రెడీ అయిపోయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయాతీ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ మూవీతో రవితేజ బాలీవుడ్ కు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రం చేస్తున్నారు. శరత్ మండవ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి రవితేజ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. దీనిపై కూడా భారీ అంచనాలున్నాయి.
ఇక ఇటీవలే సుధీర్ వర్మ డైరెక్షన్ లో సంక్రాంతి సందర్భంగా `రావణాసుర` చిత్రాన్ని మొదలు పెట్టారు. ఐదుగురు హీరోయిన్ లు నటిస్తున్న ఈ మూవీ మెగాస్టార్ క్లాప్ తో లాంఛనంగా మొదలైంది. ఇందులో లాయర్‌గా విభిన్నమైన పాత్రలో రవితేజ కనిపించనున్నారు. టైటిల్ తో పాటు ఇందులో రవితేజ పది రకాల గెటప్ లలో కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్ కూడా ట్రేడ్ వర్గాల్లో హాట్ కేక్ లా మారింది. ఇదే ఊపులో స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆధారంగా `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాన్ని ప్రకటించాడు రవితేజ. దీనికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు ఈ మూవీ ఐదు భాషల్లో విడుదల కానుంది.
ఇక త్రినాథ రావు నక్కిన తో కలిసి `ధమాకా` చిత్రం చేస్తున్నారు. ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. దీనిపై కూడా అంచనాలు బారీగానే వున్నాయి. ఇవే కాకుండా మెగాస్టార్ చిరంజీవితో కలిసి `వాల్తేరు వీరయ్య`లోనూ ఓ ప్రత్యేక అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇలా వరుసగా ఆరు చిత్రాల్లో నటిస్తూ షాకిస్తున్న రవితేజ వీటితో థియేట్రికల్ బిజినెస్ పరంగాగానూ షాకివ్వబోతున్నారు.
ఏకంగా ఈ చిత్రాల ద్వారా దాదాపు 300 కోట్ల మేర బిజినెస్ జరగబోతోందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అంతే కాకుండా ఇందులో ఒక్కో చిత్రానికి రవితేజ 12 నుంచి 14 కోట్లు రెమ్యునరేష్ తీసుకున్నారని తెలిసింది. ఆరు చిత్రాలకు ఒక్కో సినిమాకు 12 కోట్లు అనుకున్నా 72 కోట్లు ఇక్కడే వసూళు చేసేశాడని అంతా షాక్ అవుతున్నారు.