అవును. నిజమే. పవన్ కళ్యాణ్ సినిమాను డైరక్ట్ చేయడానికి ఇప్పుడు ఎస్.జె.సూర్య కు అస్సలు టైమ్ లేదు. అందుకే స్వయంగా పవన్ మనోడిని తప్పుకోమని చెప్పేశాడు. అసలు ఇలా జరగడానికి కారణమేంటి అనేగా మీ సందేహం.
నిజానికి ఆకుల శివ రాసిన ఒక కతను.. ఎస్.జె.సూర్య డైరక్షన్ లో.. శరత్ మరార్ ప్రొడక్షన్ లో.. ''కడప కింగ్'' (టెంటేటివ్ టైటిల్) అంటూ తెరమీదకు తీసుకురావల్సి ఉంది. అయితే ఈ మధ్యన ఎస్.జె.సూర్య ఒక క్యారెక్టర్ లో నటించిన ''ఇరైవి'' సినిమా విడుదలైంది. ఈ సినిమాలో మనోడి నటన ఒక రేంజులో వర్కవుట్ కావడంతో.. వెంటనే తమిళంలో పెద్ద పెద్ద హీరోల సరసన యాక్టింగ్ ఛాన్సులు వచ్చేశాయి. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన ఏ.ఆర్.మురుగుదాస్ సినిమాలో విలన్ గా కూడా నటిస్తున్నాడు కుర్రాడు. దానితో డైరక్షన్ చేయడానికి మనోడికి తీరిక దొరకదేమో అనే సందేహం వెల్లిబూర్చడంతో..స్వయంగా పవన్ ఇతన్ని తప్పించి.. ఆ ప్లేసులో మరొక డైరక్టర్ ను పెట్టాడు.
''గోపాల గోపాల'' సినిమా చేసేటప్పుడు.. మనం ఒక ప్రాజెక్టు చేద్దాం అంటూ దర్శకుడు కిషోర్ పార్దసాని (డాలి) కి పవన్ మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఈ సినిమాను అతని చేతుల్లో పెట్టాడు. అది సంగతి.