మహేష్ ముద్దు వెనక ఎమోషన్ నాకు తెలుసు!

Update: 2019-05-14 07:36 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' ఈనెల 9 రిలీజ్ అయింది.  భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది.  ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా మహేష్ రేంజ్ కు తగ్గట్టుగా ఉన్నాయి ఇదిలా ఉంటే ఈ సినిమాపై సెలబ్రిటీల ప్రశంసలు కొనసాగుతున్నాయి.

నిన్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమా గురించి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ "రైతులకు మనం చూపించే జాలి అవసరం లేదు.  వారికి మన గౌరవం కావాలి. ఇలాంటి ముఖ్యమైన అంశం పైన సినిమా తీసినందుకు వంశీగారరికి..  ఈ సినిమా చేసినందుకు మహష్ బాబు సార్ కు హ్యాట్సాఫ్.  మన జెనరేషన్ కు వ్యవసాయంతో టచ్ పోయింది.  'మహర్షి' ఆ ప్రాముఖ్యతను ఎంతో అందంగా గుర్తు చేసింది.  మమల్ని నవ్వించినందుకు.. ఏడిపించినందుకు కంగ్రాట్స్ అల్లరి నరేష్ భాయ్." అంటూ ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉంటే సీనియర్ హీరో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కూడా 'మహర్షి' ని ప్రశంసించాడు "ఒక గొప్ప సందేశం. ఆలోచన రేకెత్తించే డైలాగులు.. నటీనటుల అద్బుత నటన.  మహర్షి నాకు చాలా నచ్చింది.  వ్యవసాయాన్ని ట్రెండ్ గా మారుస్తుండడం గొప్ప విషయం.  గ్రేట్ జాబ్ మహేష్ గారు.. వంశీ గారు..అల్లరి నరేష్.. పూజ హెగ్డే.. దేవీశ్రీ ప్రసాద్.. దిల్ రాజు గారు .. పీవీపీ గారు.. మహర్షి టీమ్"  అంటూ మెచ్చుకున్నారు .

ఇక తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. "కొద్దిరోజుల క్రితం మహేష్ బాబుగారు డైరెక్టర్ వంశీని కిస్ చేస్తున్న ఫోటో చూశాను.  నాకు మహేష్ గారు పర్సనల్ గా తెలుసు కాబట్టి అదెంత నిజమైన ఎమోషన్ అనేది నాకు తెలుసు.  ఈరోజు మహర్షి చిత్రం చూశాను.  నిజమే.. నేను అనుకున్నది కరెక్ట్.  ఆ ముద్దు సినిమాపై ఉన్న ప్రేమకు.. గౌరవానికి సింబల్.  అద్భుతమైన ఫీలింగ్ ను కలిగేలా చేస్తున్నందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు." అంటూ సుదీర్ఘమైన ట్వీట్ చేశాడు.
Tags:    

Similar News