ఒక గొప్ప బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన కాంబినేషన్ మరోసారి రిపీటవుతోంది అంటే అభిమానుల్లో ఉండే ఉల్లాసం ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన పవన్ కల్యాణ్ - ఎస్.జె సూర్య జోడీ తిరిగి `పులి` చిత్రం కోసం కలిసి పని చేసినప్పుడు అంతే ఎగ్జయిట్ అయ్యారు. కానీ ఆ సినిమా ఫలితం ఊహించని విధంగా నిరాశపరిచింది.
ఖుషి చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాలన్నిటినీ దర్శకుడు ఎస్.జె.సూర్య మీడియాతో పంచుకున్నారు. ఖుషీ తెలుగు వెర్షన్ తన కెరీర్ లో అతిపెద్ద విజయమని దానికి పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ కి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఖుషీ భారీ విజయాన్ని సాధించిన తరువాత పవన్ తో రెండవ సారి `పులి`(కొమరం పులి) కోసం మళ్లీ అలాంటి మాయాజాలం పునఃసృష్టి చేయాలని ఆశించారు. కానీ అది భారీ ఫెయిల్యూర్ గా నిలిచింది. పులి గురించి సూర్య మాట్లాడుతూ.. ఈ చిత్రం ఫెయిలవ్వడం దురదృష్టకరమని .. ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదని అన్నారు.
పులి ఎన్నో అంచనాల నడుమ రిలీజై ఘోరంగా ఫెయిలవ్వడం తనని బాధించిందని సూర్య అన్నారు. ఆ ఫలితం గురించి అతను ఇంకా ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానని బాధపడుతున్నానని అన్నారు. నేటివరకు పులి నా కెరీర్ లో అతిపెద్ద నిరాశ. పవన్ అభిమానులకు ఇది ఒక పీడకల. ఇకపైనా పవన్ తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అవకాశం లభిస్తే సన్నిహిత స్నేహపూర్వక బంధాన్ని పంచుకుంటానని సూర్య ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. పులి వంటి విపత్తు తరువాత పవన్ కు విజయం ఇవ్వడానికి తాను చాలా ఆసక్తిగా ఉన్నానని అన్నారు. అయితే ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ సాధ్యమేనా? అన్నది వేచి చూడాలి. పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్.. హరిహర వీరమల్లు చిత్రాలతో బిజీ. తర్వాత హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డిలతో సినిమాలు చేస్తారు.