2022: చివ‌రి శుక్ర‌వారం స్టార్స్ వీళ్లే!

Update: 2022-12-27 23:30 GMT
ఏడాది ముగింపు శుక్ర‌వారంకు ఇంకా మూడు రోజులే స‌మ‌యం ఉంది. శుక్ర‌వారం అంటే సినిమా సంద‌డి త‌ప్ప‌నిస‌రి. ల‌క్ష్మీదేవి   క‌ళ‌క‌ళ‌లాడాల‌ని అదే రోజు ఎక్కువ‌గా సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. ఆ రోజు కొన్నేళ్ల‌గా ప‌రిశ్ర‌మ‌లో సెంటిమెట్ గామారిపోయింది. 2022 ఏడాది ముగింపు వారం కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి సంగ‌తి ఓసారి చూస్తే..

సంఖ్య ప‌రంగా చాలా సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. కానీ అవ‌న్ని లో బ‌డ్జెట్ చిత్రాలు. కంటెంట్ ప‌రంగా పోటీ ఉంటే త‌ప్ప‌! బాక్సాఫీస్ వ‌ద్ద వార్ క‌నిపించ‌దు. అయితే ఆయా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి గానీ..వాటికి స‌రైన ప్ర‌చారం క‌నిపించ‌లేదు.
 స్టార్ క్యాస్టింగ్ లేక‌పోవ‌డం....భారీ బ‌డ్జెట్ సినిమాలు కాక‌పోవ‌డంతో మీడియా అటెన్ష‌న్ డ్రా చేయ‌లేక‌పోతున్నాయి. క‌నీసం కంటెంట్ తోనైనా మార్కెట్లో హ‌డావుడి చేస్తారంటే? అదీ క‌నిపించ‌లేదు. ఆయా సినిమాల‌కు మౌత్ టాక్ తోనే మార్కెట్లో నిల‌బ‌డాలి.

`బిగ్ బాస్` ఫేమ్ సోహైల్ నటించిన `లక్కీ లక్ష్మణ్` ప్ర‌చారం సోసోగా క‌నిపిస్తుంది.   టూర్లు తిరుగుతూ హైప్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. యూత్ లో ఫాలోయింగ్ న‌టుడు కాబ‌ట్టి సినిమాకి రీచ్ ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ఇక  ఆది సాయికుమార్ `టాప్ గేర్` లో దూసుకుపోవాల‌ని రెడీగా ఉన్నాడు. కొంత కాలంగా హిట్ అంద‌ని ద్రాక్ష‌లా మారిపోయింది.

చేసిన ఏ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌డం లేదు. దీంతో మీడియా అటెన్ష‌న్ కూడా ఆదిపై అంత‌గా లేదు. సినిమాలు చేస్తున్నాడ‌నే పేరు త‌ప్ప‌! సౌండింగ్ మిస్ అవుతుంది. టాప్ గేర్ స‌క్సెస్ తో అన్ని లెక్క‌లు స‌రి చేయాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు. అలాగే  తారకరత్న ప్రధాన పాత్ర పోషించిన ‘S5` థ్రిల్లర్ జానర్ లో రూపొందిన సినిమా రిలీజ్ అవుతుంది. `అమ‌రావ‌తి` లాంటి సినిమా తార‌క‌ర‌త్న‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది.  దీంతో అదే సెంటిమెంట్ తో ఈసినిమా చేస్తున్నాడు. చాలా కాలం త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు.  

మ‌రోవైపు `రాజయోగం` అనే మరో మూవీ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది. ఇంకా `ప్రేమదేశం`.. `నువ్వే నా ప్రాణం`.. `ఉత్తమ విలన్`.. `కేరాఫ్ మహదేవపురం`.. `కోరమీను` లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీళ్లంతా కూడా శుక్ర‌వారం స‌త్తా తేల్చుకోవ‌డానికి రెడీ అవుతున్నారు. మ‌రి ఏ సినిమాకి 2022 ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News