ఎలాంటి ఇమేజ్ లేని ఓ మామూలు హీరో... హీరోయిన్ ఎవరో కూడా తెలియదు. డైరెక్టర్ కొత్తవాడు.. లో బడ్జెట్ లో తీసిన చిన్న సినిమా. స్టార్ హీరోలతో సినిమా తీయగల ప్రొడ్యూసర్ ఆ ప్రాజెక్టులో పార్టనర్ అయ్యారంటే కచ్చితంగా అందులో ఆ సినిమాలో ఏదో విశేషం ఉండే ఉంటుంది. ఆ చిన్న సినిమాకు అంతకు ముందు లేని బజ్ ఏర్పడుతోంది. ఆ సినిమా ఈజీగా ప్రేక్షకుడికి రీచ్ అవుతోంది. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఈ మధ్య కమర్షియల్ బాగా వర్కవుట్ అవుతోంది.
ఉయ్యాల జంపాల.. పెళ్లి చూపులు.. అర్జున్ రెడ్డి ఇవన్నీ బంపర్ హిట్ సినిమాలు. కానీ మొదలు పెట్టినప్పుడు లో బడ్జెట్ చిత్రాలే. వాటికి పాపులర్ ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్ గా నిలిచాక ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయగలిగారు. ఎక్కువ కలెక్షన్లు దక్కించుకోగలరు. వీటన్నింటిలో ఉన్న కామన్ పాయింట్ సినిమా కంటెంట్ లో కొత్తదనం. ‘‘చిన్న సినిమాకైనా.. పెద్ద సినిమాకైనా ప్రేక్షకుడు టిక్కెట్ రూపంలో చెల్లించే మొత్తం ఒకటే. సినిమాలో ఏదో ఒక అంశం అట్రాక్ట్ చేయకపోతే థియేటర్లకు ఎందుకొస్తాడు. అందుకే కంటెంటే ముఖ్యం. మార్కెటింగ్... ప్రేక్షకుడిని ఆకర్షించడం అన్నవి తరవాత అంశాలు’’ అనేది స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఒపీనియన్. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ కు బ్యాక్ బోన్ గా నిలిచిన ఏసియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ ది అదే మాట. ‘‘అర్జున్ రెడ్డి సినిమాకు నేను సపోర్ట్ ఇవ్వడం అన్నది ప్లస్సయింది. కాకపోతే ఓ కొత్తదనంతో డైరెక్టర్ సినిమా తీశాడు కాబట్టే నేను సపోర్ట్ చేశాను. ఆ సినిమా టీజర్ చూసినప్పుడే అందులో దమ్ముందని నాకు అర్ధమైంది.’’ అని చెప్పుకొచ్చారు సునీల్ నారంగ్.
‘‘పెళ్లి చూపులు సినిమా చూశాక మాటీంలో ప్రొడ్యూసర్ సురేష్ బాబు చేరారు. దాంతో ఆడియన్స్ లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.ఆయన ముందుకు రావడం వల్లే పెద్దసంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేయగలిగాం.’’ అని తమ సినిమాకు పెద్ద ప్రొడ్యూసర్ తో పార్టనర్ షిప్ ఏవిధంగా లాభం చేసిందీ చెబుతున్నారు పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి. ‘‘చిన్న సినిమాలను ప్రమోట్ చేయడం ఇండస్ట్రీకి చాలా అవసరం. లేకుంటే నెక్స్ట్ జనరేషన్ స్టార్స్.. డైరెక్టర్స్ ఇండస్ట్రీకి రావడానికి ఇష్టపడరు’’ అంటున్నారు సురేష్ బాబు. చిన్న సినిమాకు సపోర్ట్ చేయడానికి సిద్ధమంటున్న బడా ప్రొడ్యూసర్లందరిదీ ఒకే మాట.. కంటెంట్ ఉంటే ఓకే.