ఈ నెల మొత్తం సినిమాల వరదే అన్నట్లుంది టాలీవుడ్లో. తొలి వారం మూడు సినిమాలు.. రెండో వారం నాలుగు సినిమాలు.. మూడో వారం ఎనిమిది సినిమాలు.. ఈ వారం పది సినిమాలు.. ఇలా వారం వారానికి సినిమాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నెలలో పెద్ద సినిమాలేవీ రేసులో లేకపోవడంతో చాన్నాళ్లుగా విడుదలకు నోచుకోని చాలా సినిమాలన్ని క్లియరెన్స్ సేల్ లో తోసేసినట్లు థియేటర్లలోకి తోసేస్తున్నారు. కానీ వీటిలో జనాలకు పడుతున్న సినిమాలు చాలా తక్కువ. వారం వారానికి జనాలకు సినిమాల మీద ఆసక్తి తగ్గిపోతుండటంతో థియేటర్లకు రావడమే కష్టమైపోయింది. అందులోనూ ఈ వారంలో ఎటు చూసినా పెళ్లిళ్లే ఉన్నాయి. దీంతో సినిమాల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఈ వారం వచ్చిన ఏ సినిమాకూ ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లేదు. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మెంటల్ మదిలో’ సైతం జనాల్ని థియేటర్లకు ఆకర్షించలేకపోయింది. ‘బాలకృష్ణుడు’ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇవి కొంచెం పర్వాలేదు కానీ.. ఈ వారం వచ్చిన మిగతా సినిమాల పరిస్థితి అయితే దయనీయంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈ సినిమాలు నడుస్తున్న థియేటర్లకు జనాలు రాక.. చాలా చోట్ల మార్నింగ్ షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీని గురించి సీనియర్ పీఆర్వో బీఏ రాజు ఒక ట్వీట్ కూడా పెట్టారు. మొత్తానికి ఈ వారం రిలీజైన సినిమాలకు గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. వీకెండ్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. వారాంతం ముగిశాక పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.