తెలుగు అమ్మాయిలకి టాలీవుడ్ లో అంతగా ఛాన్సులు దొరకవు. నిర్మాతలే కాదు.. తెలుగోళ్లకి అవకాశమిచ్చే స్టార్స్ కూడా కరువే మన దగ్గర. కానీ ఓ అచ్చమైన తెలుగమ్మాయి.. అందులోనూ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో వచ్చిన ఓ అందాల భామ.. మిస్ ఇండియా ఎర్త్ కిరీటం గెలిచిన చాన్నాళ్ల తరువాత బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. తెనాలిలో పుట్టి, వైజాగ్ లో పెరిగిన శోభిత ధూళిపాళ.. ఇప్పుడో ప్రెస్టీజియస్ హిందీ ప్రాజెక్ట్ చేయబోతోంది.
ఫెమినా - మాండేట్ - హై బ్లిట్జ్ వంటి మేగజైన్స్ కు హాట్ ఫోజులిచ్చి బాగా పాపులర్ అయిన తెలుగు మోడల్ శోభిత. ఈమెను అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. అది కూడా వెర్సటైల్ యాక్టర్ గా పేరుకడించిన నవాజుద్దీన్ సిద్ధికీ హీరోగా చేస్తున్న మూవీలో కావడం విశేషం. సంచలనం సృష్టించిన సైకో సీరియ్ కిల్లర్ రమణ్ జీవిత చరిత్ర ఆధారంగా రాఘవ్ 2.0 అనే మూవీతో బాలీవుడ్ లో అడుగుపెడుతోంది శోభిత. 1960ల్లో దేశాన్నే గడగడలాడించిన వ్యక్తి ఉదంతం ఈ స్టోరీ. మసాన్ ఫేం కౌశ్.. పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.
అందంగా ఉండడమే కాదు.. దాన్ని మరింత మనోహరంగా ప్రదర్శించగల తెగువ ఉండడంతోనే.. శోభితకు బాలీవుడ్ అవకాశం తలుపు తట్టింది. ప్రస్తుతం కళాంజలికి బ్రాండ్ అంబాసిడర్ ఈమే కావడం విశేషం. తనకు ఒకేసారి బాలీవుడ్ ఛాన్స్ రావడంతో తెగ సంతోషంగా ఉంది. తెలుగుగడ్డపై నుంచి వెళ్లి.. హిందీలో సత్తా చాటిన జయప్రద, టబుల మాదిరిగా తాను కూడా మంచి స్థాయికి చేరుకుంటానని ధీమాగా చెబ్తోంది శోభిత ధూళిపాళ.