ఫోటో స్టొరీ: టెంపరేచర్స్ పెంచుతున్న తెనాలి బ్యూటీ

Update: 2019-01-19 06:11 GMT
శోభిత ధూళిపాళ పేరు తెలియని ఈ జెనరేషన్ తెలుగు ఆడియన్స్ దాదాపు ఉండరు.  'గూఢచారి' లాంటి హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించడమే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తరచుగా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీలంక ట్రిప్ లో ఉన్న ఈ భామ అక్కడ ఒక బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది.

ఆ ఫోటోకు 'లంక యూ బ్యూటీ' అనే క్యాప్షన్ ఇచ్చింది. శ్రీలంకలో ఏ ఊరో.. ఆ బీచి పేరేంటో చెప్పలేదుగానీ బీచ్ నిజంగానే అందంగా ఉంది. కానీ ఫోటోలో బీచ్ కాదు అమ్మడి హాటు పోజు కదా హైలైట్ అయింది! దాదాపు మేకప్ లేకుండా  తడిగా ఉన్న జుట్టును చేత్తో అలా పైకి అనుకుంటున్నట్టుగా పోజిచ్చింది.  సైడ్ యాంగిల్ లో ఫోటో తీయడంతో కళాత్మకంగా ఉంది.  తలపైన వేలాడుతున్న కొబ్బరి ఆకులు ఫోటోకు మరింత అందాన్నిచ్చాయి.  కళ్ళు మూసుకొని ప్రపంచం అంతా మిధ్య.. ఈ క్షణమే నిజం అన్నట్టుగా తన్మయత్వంలో ఉంది.

ఎవరన్నారు తెలుగు బ్యూటీలు హాటుగా ఉండరని? ఎవరైనా ఇకపై అంటే ఈ ఫోటో ఆ జనాలకు చూపించండి. ఒక నెటిజనుడు ఈ ఫోటోకు 'పీసీ కంటే హాటుగా ఉన్నావు' అనే కామెంట్ పెట్టాడు.  నిజమే ఆ మహానుభావుడి కళ్ళకు కనిపించిన తెనాలి పాప కమ్ మిస్ ఇండియా 2013 భామ హాట్నెస్ మీకు కనిపించిందా.. లేదా?


Full View


Tags:    

Similar News