ఇక్కడ ఆర్గనైజ్డ్ గా లేదంటున్న తెలుగు భామ!

Update: 2018-07-29 06:22 GMT
అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'గూఢచారి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ.   సినిమా టీజర్ ట్రైలర్లు ఇప్పటికే ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. దీంతో తన మొదటి సినిమాతోనే బ్రేక్ వస్తుందని శోభిత చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శోభిత ఈమధ్య మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది.. ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటోంది.   శోభిత మోడలింగ్ నేపథ్యం నుండి వచ్చిన హీరోయిన్.  తను 2013 లో మిస్ ఇండియా టైటిల్ విన్నర్. తెలుగు అమ్మాయే  అయినా ప్రొఫెషన్ కారణంగా ముంబైలో ఉంటోంది.  ఇప్పుడు తెలుగు సినిమా చేస్తుండడంతో టాలీవుడ్ వర్క్ కల్చర్  కూడా స్లోగా అర్థం చేసుకుంటోంది.   ఈ విషయం పై మాట్లాడుతూ ముంబైలో మోడలింగ్ ఇండస్ట్రీ - బాలీవుడ్ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాయని చెప్తోంది.   యాడ్ ల కోసమైనా - సినిమా అవకాశాలకోసం అయినా నటులకు ఆడిషన్స్ రెగ్యులర్ గా జరుతుంటాయని, అవకాశాలు సాధించేందుకు క్యాస్టింగ్ డైరెక్టర్లు సాయం చేస్తారని చెప్తోంది.  దీంతో కొత్తవాళ్ళకు అదో మంచి ప్లాట్ ఫాం లా ఉంటుందని, కానీ తెలుగు సినిమాలు చేద్దామని అనుకుంటే అవకాశాల కోసం డైరెక్టర్లను ఎలా అప్రోచ్ కావాలో అర్థం కాలేదని చెప్పింది.

అవన్నీ పక్కనబెడితే శోభితకు చేతిలో మాత్రం ఇప్పుడు మూడు సినిమాలున్నాయి.   డెబ్యూ ఫిలిం 'గూఢచారి' ఆగష్టు 3 న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా కాకుండా నివిన్ పౌలీ తో ఒక మలయాళం ఫిలిం - ఒక బాలీవుడ్ మూవీ ఆఫర్ కూడా ఉందట.  చూస్తుంటే 'గూఢచారి' బ్యూటీ కి గుడ్ టైం స్టార్ట్ అయినట్టే ఉంది.
Tags:    

Similar News