లాక్ డౌన్ టైంలో తెలుగమ్మాయి ఫొటో షూట్....!

Update: 2020-04-26 06:45 GMT
సోషల్ మీడియా ఉపయోగించే వాళ్ళందరూ సెన్సిబిల్ గా ఉంటారని... ఇతరుల ఫిల్లింగ్స్ హర్ట్ చేయరని అనుకుంటే పొరపాటే. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ప్రతి విషయం మీద నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మన తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల నెటిజన్ల కామెంట్లకు బలయ్యింది. అడివి శేష్ న‌టించిన 'గూఢ‌చారి' చిత్రంతో హీరోయిన్‌ గా ప‌రిచ‌య‌మైంది శోభితా దూళిపాళ్ల‌. ఇటీవల ఆమె ఓ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. 'లాక్‌డౌన్‌ కారణంగా మా ఇంటి దగ్గరే ఈ ఫొటోషూట్‌ చేసుకున్నాను. నాకు నేనే మేకప్‌ వేసుకుని.. సెల్ఫ్‌ టైమర్‌ తో స్వయంగా నేనే ఫొటోలు తీసుకున్నాను' అని శోభితా పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోషూట్‌ ఫొటోలు బయటకు రావడంతో.. అందులోని ఓ ఫొటోలో ఆమెను మరో వ్యక్తి ఫొటో తీస్తున్నట్లు ఉంది. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ‘శోభితా అబద్ధం చెప్పింది. సెల్ఫ్‌ టైమర్‌ పెట్టి ఫొటోషూట్‌ చేస్తే ఈ ఫొటోగ్రాఫర్‌ ఏం చేస్తున్నాడు. అందరూ కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సిన్గ్ పాటిస్తుంటే శోభితా మాత్రం కెమెరా మ్యాన్ ని పెట్టుకొని ఫోటో షూట్లు చేస్తోంది. బాధ్య‌త‌గ‌ల సెల‌బ్రిటీలుగా వుంటూ ప‌ది మందికి ఆద‌ర్శంగా నిల‌వాల్సింది పోయి ఇలా చేస్తోంది’ అంటూ విపరీతంగా కామెంట్లు పెట్టారు.

దీంతో మ‌న‌స్తాపానికి గురైన శోభిత అస‌లు ఫొటో షూట్ ఎలా ఇరిగింది.. త‌ను సెల్ఫ్ టైమ‌ర్‌ తో ఫొటోల‌కు ఎలా పోలిజిచ్చింది అనే వాటిని ఒక పెద్ద లెటర్ ద్వారా వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. 'నెటిజన్ల ట్రోలింగ్‌ గురించి విని ఎంతో బాధపడ్డాను. పూర్తి విషయం తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి ఎలా వస్తారో అనిపించింది. దీనివల్ల నేను ఒక విలువైన పాఠం నేర్చుకున్నాను. నా ఫొటో షూట్‌ ఎలా జరిగిందో మీకు చెప్పాలని భావిస్తున్నాను. ఫొటోషూట్‌ కోసం రెడీ అయ్యాక.. ఓ కాఫీ కప్పు, నా ఫోన్‌తో ఫొటోషూట్‌ తీయడానికి మా టెర్రస్‌ పైకి వెళ్లాను. ఆ సమయంలో టెర్రస్‌ పై చాలామంది వ్యక్తులు ఉన్నారు. నేను ఫొటోలు తీసుకోవడంలో ఇబ్బంది పడడం చూసిన ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి సాయం చేస్తానని చెప్పారు. నాకు కావాల్సిన విధంగా కొన్ని ఫొటోలు తీయించుకున్న తర్వాత అతనికి థ్యాంక్స్‌ చెప్పాను. అతను అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ నేను మ్యాగజైన్‌ కవర్‌ ఫొటో కోసం పంపించిన ఫొటోలు ఏవీ కూడా అతను తీసిన ఫొటోలు కావు. నా సొంతంగా సెల్ఫ్‌ టైమర్‌ పెట్టుకుని తీసుకున్న ఫొటోలే. ఇప్పుడు మీరు ట్రోల్‌ చేస్తున్న ఆ ఫొటోను కూడా నేనే నెట్టింట్లో పోస్ట్‌ చేశాను. ఆ ఫొటోలు పోస్ట్‌ చేసినప్పుడే క్యాప్షన్‌ ఇచ్చి ఉండాల్సింది' అని పేర్కొన్నారు. ఏదేమైనా శోభితా ప్రతీ దానికి ఫీల్ అవకుండా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఒక భాగమే అని తెలుసుకొని మసలుకుంటే మంచిదని కొంతమంది సలహా ఇస్తున్నారు.
Tags:    

Similar News