నా కెరీర్లో ఇద్దరు జఫ్ఫాలు తగిలారు!

Update: 2018-07-31 07:12 GMT
మోడలింగ్ లో అడుగుపెట్టి మిస్ ఇండియా కిరీటం సాధించడమే కాకుండా - బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.  ఇప్పుడు 'గూఢచారి' తో తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతోంది. త్వరలో మలయాళం ల్యాండ్ లో కూడా నివిన్ పౌలీ సినిమా తో కాలుమోపనుంది.   రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది ఈ తెలుగు బ్యూటీ.

సహజంగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నారంటే డ్రింక్ చేస్తారనే అభిప్రాయం ఉంటుంది.  కానీ శోభిత మాత్రం తను కావాలనే దానికి దూరంగా ఉన్నానని చెప్తోంది.  దానికి కారణం ఒకసారి కనుక మొదలుపెడితే అపలేదట.  అందుకే ఆ అలవాటుకు దూరంగా ఉన్నానంటోంది.  తన మోడలింగ్ కెరీర్ గురించి మాట్లాడుతూ ఫెమినా మిస్ ఇండియా కీరిటం సాధించాక కింగ్ ఫిషర్ 2014 క్యాలెండరు మోడల్ గా అవకాశం వచ్చిందని... అప్పుడు నెర్వస్ గా ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగేసి ఆ అవకాశాన్ని అందుకున్నానని చెప్పింది.

అంతే కాదు తన మోడలింగ్ - ఫిలిం కెరీర్ లో ఇద్దరు జఫ్ఫాలు తగిలారని.. కానీ వాళ్ళ వల్ల కూడా కొంత మంచే జరిగిందని అంటోంది.  అలాంటి వాళ్ళ వల్లే ఇప్పుడు తను మరింత కాన్ఫిడెంట్ గా మారిందని - జనాల అభిప్రాయాల కంటే తన మనస్సు చెప్పేదే ముఖ్యమని తెలుసుకున్నానని చెప్పింది.   శోభిత మాటలు తెలుగు బ్యూటీ విత్ అల్ట్రా-మోడరన్ టచ్ అనిపించడం లేదూ..?
Tags:    

Similar News