మాజీ మిస్ ఇండియా, తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ మొదట హిందీ సినిమాలతోనే తెరంగేట్రం చేసింది గానీ తాజాగా 'గూఢచారి' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. సినిమా సూపర్ హిట్ కావడం - శోభిత పాత్ర కూడా ప్రాధాన్యం ఉన్నది కావడంతో తనకు తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపే తెచ్చుకుంది.
ఈ తెనాలి బ్యూటీ ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చింది కదా.. అందుకే లిప్ లాకులకు - బోల్డ్ అవతారం లో కనిపించేందుకు పెద్దగా అభ్యంతరాలు లేవు. 'గూఢచారి' ని చూసి కనుక మన తెలుగు అమ్మాయి ఇంత బోల్డా అని మీరు కనుక ఆశ్చర్యపోయి ఉంటే ఇక మీరు తన నెక్స్ట్ సినిమా సంగతి తెలిస్తే మరింతగా షాక్ అవడం ఖాయం. శోభిత 'మూతోన్' అనే ఒక మలయాళం - హిందీ బైలింగ్వల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళం సెన్సేషనల్ హీరో నివిన్ పౌలి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా శోభిత ఒక సెక్స్ వర్కర్ పాత్రలో కనిపిస్తుందట.
సెక్స్ వర్కర్ పాత్ర పోషించడం అంటే శోభిత కు నటిగా అదొక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇప్పటికే 'గూఢచారి' సినిమాలో తన నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. ఈసారి మలయాళం సినిమాలో క్లిష్టమైన పాత్రను పోషించేందుకు ప్రిపరేషన్ కూడా గట్టిగానే చేస్తోందట. మరి ఈ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షిస్తుందేమో వేచి చూడాలి.