ఓటర్ ఐడీ అడ్రెస్ మార్చుకొని పవన్ కు ఓటేయాలని హాట్ బ్యూటీని కోరిన ఫ్యాన్..!
'మాస్టర్' బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలతో నెట్టింట హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన అందచందాలతో భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అదే సమయంలో కొందరు ఆమెను ఎప్పుడూ ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు.
లేటెస్టుగా మాళవిక ట్విట్టర్ లో చిట్ చాట్ నిర్వహించింది. నెటిజన్లు అడిగే అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో ఓ ట్రోలర్ ఆమెను ట్యాగ్ చేస్తూ.. యాక్టింగ్ స్కిల్స్ మరియు టాలెంట్ లేకపోయినప్పటికీ.. తమను తాము మీ అభిమానులుగా పిలుచుకునే వ్యక్తులు సోషల్ మీడియాలో మీ ఫోటోషూట్ & హాట్ ఫోటోల కోసం మాత్రమే వస్తుంటారు. మీరు దీని గురించి ఏమంటారు అని ప్రశ్నించాడు.
దీనికి మాళవిక మోహనన్ బదులిస్తూ “అంటే మీరు కూడా నన్ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారని నా ఫోటో షూట్‌లకు అభిమాని అని అర్థం కదా?” అని పేర్కొంది. మాళవిక సిచ్యుయేషన్ ను హ్యాండిల్ చేసిన విధానానికి.. సైలెంట్ గా ట్రోలర్ కు కౌంటర్ ఇచ్చిన దానికి నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.
నిజానికి గతంలో కూడా మాళవిక అనేక సందర్భాల్లో ట్రోల్స్ ని చాలా హుందాగా గౌరవంగా హ్యాండిల్ చేసింది. ప్రతి యాక్టర్ తన జీవితంలో తమను తాము ఎక్కువగా ప్రేమించుకునే స్థితికి రావాలని.. ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకోకూడదని ఆమె చెబుతూ ఉంటారు.
ఇకపోతే చిట్ చాట్ లో మహేష్ బాబు గురించి అడగ్గా.. ''ఆయనొక స్టైలిష్ మాక్స్ స్టార్. మా నాన్న ఆయనతో కలిసి ‘మహర్షి’ షూటింగ్ లో ఉన్నప్పుడు.. నేను హైదరాబాద్ లో ఒకసారి ఆయన్ని కలిశాను. అతను చాలా వినయంగా స్వీట్ గా మాట్లాడతారు'' అని పేర్కొంది. అంతేకాదు మహేశ్ తో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ మూవీ లేదా రోమ్ కామ్ చేయాలని ఉందని మాళవిక మోహనన్ తన కోరిక వెలిబుచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ''దయచేసి మీ ఓటర్ ఐడీ అడ్రస్ గాజువాకకు మార్చుకుని మా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి'' అని పేర్కొంటూ అమ్మడిని ట్యాగ్ చేశాడు. దీనికి మాళవిక స్పందిస్తూ.. ''వావ్ ఇది చాలా స్పెసిఫిక్ ప్రశ్న'' అని బదులిచ్చింది.
కాగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్.. 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్ 'పేట' సినిమాలో శశికుమార్ కి జోడీగా నటించింది. విజయ్ సరసన 'మాస్టర్' సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇటీవల ధనుష్ కు జోడీగా నటించిన 'మారన్' మూవీ ప్లాప్ అయింది.
మాళవిక ను తెలుగులో నటింపజేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో విజయ్ దేవరకొండ - మాళవిక మోహన్ కాంబోలో 'హీరో' అనే సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఒక షెడ్యూల్ తర్వాత ఈ స్పోర్ట్స్ డ్రామాని పక్కన పెట్టేసారు. మరి త్వరలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ఇకపోతే సిద్ధాంత్ చతుర్వేది సరసన నటిస్తోన్న 'యుధ్రా' చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెడుతోంది.