అప్‌ కమింగ్ హీరోల మధ్య లొల్లి.. ఖర్చు చేసి మరీ కక్ష సాధింపు?

Update: 2022-12-02 04:27 GMT
వారిద్దరు టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరోలు.. ఇంకా ఇద్దరు కూడా సినిమాల సంఖ్య రెండు అంకెలకు చేరలేదు. అయినా కూడా ఇద్దరి మధ్య లొల్లి కాస్త సీరియస్ గా సాగుతోంది. ఇద్దరు కూడా కథల ఎంపిక విషయంలో మంచి పట్టు ఉన్న హీరోలు అనే పేరు దక్కించుకున్నారు. అంతే కాకుండా యంగ్‌ హీరోలు అయినా కూడా రైటింగ్ పై మంచి పట్టు ఉంది. ఇద్దరు వారి సినిమాలకు వారే కథ మరియు ఇతర రైటింగ్‌ వర్క్ చూసుకుంటూ ఉంటారు.

ఇద్దరికి కూడా ఒకొక్క కమర్షియల్‌ హిట్‌ పడింది... కొన్ని సినిమాలు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఇంకా ఈ ఇద్దరు టైర్ 2 హీరోల జాబితాలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయం లోనే వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు బాహాటంగా ఎప్పుడు కూడా పెట్టుకున్నది లేదు.. కానీ ఒకరి పై ఒకరు సోషల్‌ మీడియా ద్వారా ట్రోల్స్ చేయిస్తున్నారట.

ఇద్దరు హీరోలు కూడా సొంత సోషల్‌ మీడియా టీమ్‌ ఏర్పాటు చేసుకుని అవతలి హీరోకు సంబంధించిన విషయాల పట్ల ట్రోల్స్ చేయడం చేస్తున్నారట. ఇద్దరు కూడా భారీగా ఖర్చు చేసి ఒకరిని ఒకరు ట్రోల్స్ చేసుకుంటూ ఉన్నారట.

ఈ విషయం ఇప్పటి వరకు అధికారికంగా బయటకు అయితే రాలేదు కానీ ఆ ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వార్ పీక్స్ లో జరుగుతుందట.

ఇటీవల వీరిలో ఒక హీరో సినిమా కొన్ని కారణాల వల్ల నిలిచి పోయింది. హీరో ఆ సినిమా నుండి బయటకు వచ్చాడు. అదే సినిమాలో ఆ హీరోకు వ్యతిరేకంగా ఉన్న ఈ హీరో చేసేందుకు ముందుకు వచ్చాడట.

మొత్తానికి ఇద్దరు హీరోల మధ్య ఉన్న వైరం మెల్ల మెల్లగా పెరిగి పెద్దది అవుతోంది. ముందు ముందు మరింతగా ఇద్దరు బాహాటంగానే విమర్శలు చేసుకునే స్థాయికి ఈ కోల్డ్‌ వార్‌ చేరుతుందా అనేది చూడాలి. ఆ ఇద్దరు హీరోలు ఇలాంటి గొడవలు మానుకొని సినిమాలపై దృష్టి పెడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News