వాటిపై మాట్లాడను అంటున్న సెన్సేషనల్ పిల్ల

Update: 2018-02-15 04:43 GMT
ప్రియా ప్రకాష్ వారియర్.. నిన్న మొన్నటి వరకు ఈమె పేరు నెటిజన్లలో తెలిసింది అతి కొద్దిమందికి.. ఈ రోజు ఆమె పేరు తెలియని నెటిజన్లంటూ ఉండరంటే ఒప్పుకునే తీరాలి. అంతగా పాపులరైంది ఆమె. ఆమె తొలిసారి హీరోయిన్ గా నటిస్తున్న మళయాళ మూవీ ఒరు అడార్ లవ్ లో ఓ పాటను ప్రేమికుల దినోత్సవం సందర్బంగా విడుదల చేశారు. అందులో ప్రియా ప్రకాష్ హావభావాలు యువతకు విపరీతంగా నచ్చేయడతో ఆ పాట ట్రెండింగ్ గా మారిపోయింది.

భాషతో సంబంధం లేకుండా దేశం మొత్తాన్ని ఊపేసిన ఈ పాటలో నటించడానికి ముందు తాను ఎలాంటి రిహార్సల్ చేయలేదని అంటోంది ప్రియా. ‘‘హీరోను చూసి చిరునవ్వు నవ్వుతూ కన్ను గీటే సీన్ ను డైరెక్ట్ గానే చేశారు. అది ఇంత వైరల్ అవుతుందని కూడా అనుకోలేదు. అసలే మాత్రం ఊహించని ఈ పాపులారిటీ చూసి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు’’అంటూ తనకింత క్రేజ్ తెచ్చిన సీన్ గురించి చెప్పుకొచ్చింది ప్రియ ప్రకాష్ వారియర్.

ప్రియా ప్రకాష్ తోపాటు ఒరు అడార్ లవ్ లో పాట కూడా చాలామంది దృష్టిని ఆకర్షించింది. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఈ పాట ఉందంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే విషయం ఈ పాట పాపులారిటీకి కారణమైన ప్రియా వద్ద ప్రస్తావిస్తే.. దీని గురించి తనకేమీ తెలియదని..  దీనిపై ఏమీ మాట్లాడకుండా గా ఉండిపోవడమే మేలనిపిస్తోందంటూ సైలెంట్ అయిపోయింది.


Tags:    

Similar News