ఆ స్టార్ హీరోయిన్ ఆదాయం తెలిస్తే స్టార్ హీరోలు నోరెళ్ళ బెట్టాల్సిందే!

Update: 2020-10-05 15:00 GMT
మనం ఎప్పుడు చూసినా ఆ స్టార్ హీరో అంత తీసుకున్నాడంటా. ఈ స్టార్ ఇంత తీసుకున్నాడంటా అని చెప్పు కుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంతగా చర్చించుకోం.అయితే ఇప్పుడు హీరోయిన్ల పారితోషికాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. కొందరు సంపాదనలో హీరోలను కూడా మించిపోతున్నారు. ఇండియాలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే వంటి హీరోయిన్లు పెద్ద మొత్తంలోనే తీసుకుంటున్నారు. మన దేశంలో భారీగా సంపాదన ఉన్న హీరోయిన్ ఎవరంటే ప్రియాంక చోప్రానే. మరి ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం అందుకుంటున్న నటి ఎవరంటే అమెరికన్ నటి సోఫియా వెర్గారా. ఆమె టీవీ షోలు, సినిమాలు, యాడ్స్ వంటి రూపంలో భారీగా ఆర్జిస్తూ సంపాదనలో నంబర్ వన్ గా నిలిచింది. ది మోడ్రన్ ఫ్యామిలీతో పేరు ప్రఖ్యాతులు తెచుకున్న సోఫియా వెర్గారా ప్రపంచంలోనే అత్యధిక పారితోషకం, వార్షికాదాయం పొందుతున్న నటిగా రికార్డు సృష్టించింది. ఆమె ఏడాది కాలంలో 43 మిలియన్ డాలర్లు సంపాదించింది. అంటే మన అక్షరాలా రూ.315 కోట్లు ఆర్జించింది. వరల్డ్ లోనే పాపులారిటీ ఉన్న ఏంజెలినా జోలీని కూడా వెర్గారా దాటేసింది.

‘ది మోడ్రన్‌ ఫ్యామిలీ’ షోలో ఒక్క ఎపిసోడ్‌కు మోర్గారా 50 వేల అమెరికా డాలర్లు (దాదాపు రూ.3.66 కోట్లు) పారితోషికంగా తీసుకుని రికార్డు సాధించింది. సోఫియా టీవీ షోలతో పాటు సినిమాలు, పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ ఉంటూ ఏడాదికి రూ.300 కోట్లకు పైగా సంపాదిస్తోంది. ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌ లో ఆమెను రెండు కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాలో ప్రమోషన్లే ఆమెకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. ఫోర్బ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన 2020 టాప్‌-10 హైయెస్ట్ పెయిడ్ నటీమణుల జాబితాలో మోర్గారా 43 మిలియన్ డాలర్లతో టాప్ లో నిలవగా.. ఏంజెలీనా జోలీ (35.5 మిలియన్‌ డాలర్లు), గాల్ గాడోట్ (31 మిలియన్‌ డాలర్లు), మెలిస్సా మెక్‌కార్తి (25 మిలియన్‌ డాలర్లు), మెరిల్‌ స్ట్రీప్‌ (24 మిలియన్‌ డాలర్లు), ఎమిలీ బ్లంట్‌ (22.5 మిలియన్‌ డాలర్లు), నికోల్‌ కిడ్మాన్‌ (22 మిలియన్‌ డాలర్లు), ఎల్లెన్‌ పాంపియో (19 మిలియన్‌ డాలర్లు), ఎలిజబెత్‌ మోస్‌ (16 మిలియన్‌ డాలర్లు), వియోలా డేవిస్‌ (15.5 మిలియన్‌ డాలర్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు.
Tags:    

Similar News