నాగ్ ప‌నైపోయింది.. ఇక బాల‌య్యే

Update: 2016-01-05 14:53 GMT
సంక్రాంతికి రాబోతున్న పెద్ద సినిమాల్లో అన్నిటికంటే ముందు డేట్ క‌న్ఫ‌మ్ చేసుకున్న‌ది ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’నే. నెల‌న్న‌ర కింద‌టే త‌న సినిమా జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించాడు అక్కినేని నాగార్జున‌. మ‌ధ్య‌లో ఈ సినిమా సంక్రాంతికి వ‌స్తుందా రాదా అని అనుమానాలు వ‌చ్చాయి కానీ.. నాగ్ ఎంత‌మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌మోష‌న్ల విష‌యంలోనూ య‌మా స్పీడు చూపిస్తున్న నాగ్‌.. సెన్సార్ ప‌ని కూడా అంద‌రి కంటే ముందే పూర్తి చేశాడు. మంగ‌ళ‌వారం సాయంత్రం ‘సోగ్గాడే చిన్నినాయ‌నా’ సెన్సార్ తంతు పూర్త‌యింది. సినిమాకు యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ఈ ప‌ని పూర్త‌వ‌గానే జ‌న‌వ‌రి 15న వ‌స్తున్నాడు అంటూ కొత్త పోస్ట‌ర్లు కూడా రిలీజ్ చేసేసింది సోగ్గాడే.. టీమ్‌.

సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో ఇప్ప‌టికే ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక మిగిలింది ‘నాన్న‌కు ప్రేమ‌తో’ - ‘డిక్టేట‌ర్’ సినిమాలే. సంక్రాంతికి అంద‌రి కంటే ముందు రానున్న ఎన్టీఆర్ సినిమా లేటుగా సెన్సార్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ఆ సినిమా షూటింగే ఈ రోజు పూర్త‌యింది. ఇక ‘డిక్టేట‌ర్’ సెన్సార్ కు ఇప్ప‌టికే ముహూర్తం కుదిరింది. బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల 36 నిమిషాల‌కు సెన్సార్ షో మొద‌లు కానుంది. పండితుల స‌ల‌హాతో బాల‌య్య స్వ‌యంగా నిర్ణ‌యించిన ముహూర్తం ఇది. ‘నాన్న‌కు ప్రేమ‌తో’ సెన్సార్ 9 లేదా 10వ తారీఖున జ‌ర‌గొచ్చ‌ని అంచ‌నా.
Tags:    

Similar News