టాక్ కొంత డివైడ్ గా ఉన్నా రిపోర్ట్స్ ఏమి చెప్పినా కంటెంట్ గురించి ఎలాంటి కామెంట్స్ వచ్చినా మహర్షి బాక్స్ ఆఫీస్ దూకుడు స్టడీగానే కొనసాగుతోంది. వంద కోట్ల గ్రాస్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది. మహర్షి గురించి నెగటివ్ గా వినిపించిన కామెంట్స్ లో ప్రధానమైంది లెన్త్. మూడు గంటలకు రెండు నిముషాలు తక్కువ నిడివిని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికే అధిక శాతం వ్యక్తం చేసిన అభిప్రాయం.
అది చాలదు అన్నట్టు ఇప్పుడు మరో ఐదు లేదా ఎనిమిది నిమిషాల అదనపు సీన్లు జోడించే ప్లాన్ లో ఉంది యూనిట్. ఉన్నవే కాస్త కట్ చేయమంటూ ఉంటె ఇంకా పెంచడం ఏమిటి అంటున్న వారు లేకపోలేదు. పూజా హెగ్డే ఫామిలీ మహేష్ బాబుని పెళ్లి చూపులు చేసే సీన్ ఇంకా ఎక్కువసేపు ఉంటుందట. కామెడీ బాగా ఉన్న ఆ సీన్ ని ఎడిటింగ్ లో కోత వేశారు. ఇకపై దాన్ని పూర్తిగా చూడొచ్చు. అలాగే క్లైమాక్స్ లో రైతులతో వచ్చే ఎమోషనల్ సీన్స్ కి ఇంకో సన్నివేశాన్ని జోడించే పనిలో ఉన్నారట. అది కూడా కత్తెర వేసిందే.
ఇప్పుడు ఇవి తోడైతే మొత్తం మూడు గంటల ఐదు నిముషాలు థియేటర్లో ఉండాలి. ఇంటర్వెల్ కమర్షియల్ యాడ్స్ సమయం అదనం. మొత్తం మూడున్నర గంటలు హాల్లోనే ఉండాలి. ఇప్పటికే ఆ విషయంలో ఫీడ్ బ్యాక్ తేడాగా ఉండగా మహేష్ కు నచ్చాయన్న కారణంతో జోడించడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అయితే ఈ సీన్ల కలిపివేత ఇప్పుడు ఉండదు. ఫస్ట్ వీక్ లోనే జోడిస్తే ఇంకో రకమైన అభిప్రాయాలు వ్యక్తం కావొచ్చు. ఎఫ్2 తరహాలో రెండో వారం లేదా పది రోజుల తర్వాత కలిపితేనే బెటరేమో. దీనికి సంబంధించిన ప్రకటన ఇంకో రెండు మూడు రోజుల్లో రావొచ్చు