సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు టాక్ గొప్పగా ఏమీ లేదు. కానీ కలెక్షన్లకు మాత్రం తిరుగులేదని లెక్కలు చూపిస్తున్నారు. తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి పది కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మూడు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో 25 కోట్ల దాకా వసూలు చేసినట్లు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తొలి మూడు రోజుల్లో గ్రాస్ వసూళ్లు 30 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. ఆదివారం కూడా హౌస్‌ఫుల్స్ గ్యారెంటీ కాబట్టి మంచి వసూళ్లే వస్తాయి. అసలే వేసవి సెలవులు.. పైగా పెద్ద సినిమా కోసం జనాలు చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. పైగా అడ్వాన్స్ బుకింగ్స్ ముందే అయిపోయాయి.
కాబట్టి సన్నాఫ్ సత్యమూర్తి అసలు సత్తా ఏంటనేది సోమవారం తేలిపోతుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఇంటర్వ్యూల్లో ఇదే మాట చెప్పాడు. ప్రస్తుతానికి కలెక్షన్లు చాలా బాగున్నాయని.. సోమవారం రోజు పరిస్థితి ఎలా ఉంటుందన్నదాన్ని బట్టి సినిమా మీద ఓ అంచనాకు వస్తామని చెప్పాడు త్రివిక్రమ్. మిగతా వాళ్లందరూ కలెక్షన్ల లెక్కలు చెప్పి విమర్శకుల్ని తిట్టిపోస్తున్నారు కానీ.. త్రివిక్రమ్ మాత్రం నిజాయితీగా అసలు పాయింట్ చెప్పడం విశేషమే. ఎంత మంచి టాక్ వచ్చిన సినిమా అయినా వీకెండ్ అయ్యాక డల్ అయిపోతుంది. టెంపర్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మరి డివైడ్ టాక్‌తో మొదలైన 'సన్నాఫ్ సత్యమూర్తి' పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.