మ్యాగజైన్ కవర్ పేజీ పై మెరిసిన దబాంగ్ బ్యూటీ!

Update: 2020-07-01 09:50 GMT
దబాంగ్ సినిమా హిట్ట‌వ్వ‌డంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది సోనాక్షి సిన్హా. అలా వెంటనే మరో రెండు మూడు హిట్లు వ‌చ్చేసాయి. దాంతో అమ్మడు గ్లామర్ షో చేయకుండానే స్టార్ హీరోయిన్ అయిపోయింది. కానీ ఎంత వేగంగా టాప్ హీరోయిన్ అయిందో అంతే వేగంగా మళ్లీ కింద‌కి ప‌డిపోయింది ఈ ముద్దుగుమ్మ. సోనాక్షి ఒక‌ప్పుడు గ్లామ‌ర్ షో అంటే పేరెంట్స్ ఒప్పుకోరండీ అనేది కానీ.. ఇప్పుడు ఓ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తూ రెచ్చిపోతుంది. అవ‌కాశాల కోసం విలువలు ప‌క్క‌న బెట్టి వ‌లువ‌లు త‌గ్గించేసింది. కెరీర్ మొద‌ట్లో ఎక్స్ పోజింగ్ అంటే అంతెత్తు ఎగిరిప‌డే సోనాక్షి.. ఇప్పుడు అడ‌క్క‌పోయినా ప్ర‌తీ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ పై పొట్టి డ్ర‌స్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది. తాజాగా హెల్తీ టిప్స్ అందించే మ్యాగజైన్ కోసం హెల్తీతో పాటు కాస్త బోల్డ్ గా కూడా ఫోటోషూట్ చేసింది సోనాక్షి.

కాస్మోపాలిటన్ మ్యాగజైన్ పై మతిపోయే పోజు ఇచ్చింది అమ్మడు. తెల్లని షర్ట్ ధరించి పైన బటన్స్ తీసేసి కుర్రకారుకి సెగలు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో సోనాక్షికి మిలియన్ల సంఖ్యలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్.. ప్రొఫెషనల్ కెరీర్ సంబంధించి అప్డేట్స్ అభిమానులకు అందిస్తూ ఉంటుంది. తాజాగా పోస్ట్ చేసిన కాస్మోపాలిటల్ మ్యాగజైన్ కోసం దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అమ్మడు కేవలం ఒక లాంగ్ షర్ట్ వేసుకొని సిల్కీ హెయిర్ తో.. పోజు అదరగొట్టింది. అంతేగాక లవ్ యువర్ సెల్ఫ్.. బి యువర్ సెల్ఫ్ అంటూ కాప్షన్ కూడా మెన్షన్ చేయడం విశేషం. ప్రస్తుతం క్వారంటైన్ ఫోటో షూట్ అంటూ తెలిపింది సోనాక్షి.
Tags:    

Similar News