అసలే సినిమాలు లేక ఢీలా పడిపోయిన సోనాక్షి సిన్హాకు ఒక ఈవెంట్ మేనేజర్ పెట్టిన కేసు పెద్ద తలనొప్పిగా మారింది. సోనాక్షి సిన్హా అడ్వాన్స్ తీసుకుని ఈవెంట్ కు రాకపోవడంతో తాము చాలా నష్టపోయామంటూ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిన ఈవెంట్ మేనేజర్ పై సోనాక్షి సిన్హా తరపు వారు రివర్స్ ఎటాక్ చేశారు. మొత్తం తప్పు వారు చేసి ఇప్పుడు సోనాక్షి సిన్హాపై కేసు పెట్టారు అంటూ ఆరోపించారు.
సోనాక్షి వివాదం తీవ్రతరం అయిన నేపథ్యంలో ఆమె ఆర్గనైజర్స్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ.. ఈవెంట్ మేనేజర్ ముందుగా మాట్లాడుకున్న అమౌంట్ ఇవ్వని కారణంగా సోనాక్షి షోకు వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బు కూడా ముందే చెల్లించాలని, అలాగే అప్ అండ్ డౌన్ టికెట్స్ ముందుగానే బుక్ చేయాలని, అలా బుక్ చేస్తేనే షోకు వస్తామని ముందే చెప్పాము. కాని వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసిన ఈవెంట్ మేనేజర్ రిటర్న్ టికెట్ బుక్ చేయలేదు. దాంతో పాటు పారితోషికం కూడా ఇవ్వని కారణంగా ఎయిర్ పోర్ట్ వరకు వచ్చిన సోనాక్షి సిన్హా వెనక్కు వెళ్లి పోయిందని ఆమె తరపు ఆర్గనైజర్స్ అంటున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఈవెంట్ మేనేజర్ తప్పు ఉంది, కాని ఆయన మాత్రం ఇప్పుడు సోనాక్షిపై కేసు పెట్టాడు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోంది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పుకొచ్చారు.