భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో సోనాక్షి షాకింగ్ రోల్..!

Update: 2021-07-08 02:30 GMT
బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హా కెరీర్ ఇప్పుడు కాస్త నెమ్మ‌దిగానే ఉంది. ఆరంభంలో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీ అయినా మ‌ధ్య‌లో వ‌చ్చిన ప‌రాజయాల కార‌ణంగా స్పీడ్ త‌గ్గింది. ప్ర‌స్తుతం సెల‌క్టివ్ గా పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉన్న సినిమాలే చేస్తోంది.  అయితే ప్ర‌స్తుతం బాలీవుడ్ లో పెద్ద తెర క‌న్నా..బుల్లి తెర‌కే ఎక్కువ డిమాండ్ క‌నిపిస్తోంది. సీనియ‌ర్ హీరోయిన్ల నుంచి న‌వ‌త‌రం నాయిక‌ల వ‌ర‌కూ ఎక్కువ‌గా  వెబ్ సిరీస్ ల‌వైపు మ‌ళ్లుతున్నారు. సినిమాలు చేస్తూనే చిన్న‌పాటి వెబ్ సిరీస్ ల‌లో వ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. మార్కెట్ లో బ్రాండ్ విలువ‌ను పెంచుకునేందుకు వెబ్ సిరీస్ లు ఓ మంచి ఆప్ష‌న్ గా క‌నిపిస్తున్నాయి.

అందుకే ఇప్పుడు సోనాక్షి సిన్హా కూడా వెబ్ సిరీస్ ల‌పై సీరియ‌స్ గా దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది.  రెండేళ్ల క్రిత‌మే సోనాక్షి ఓ వెబ్ సిరీస్ లో న‌టించింది. కానీ అది అంత‌గా గుర్తింపు తేలేదు. ఆ త‌ర్వాత ఆమె కూడా అటు వైపు ఏకాగ్ర‌త పెట్టలేదు. అయితే తాజాగా  బాలీవుడ్ స్టార్ మేక‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించ‌నున్న `హిరామండి` అనే  ఓ వెబ్ సిరీస్ లో న‌టించ‌డానికి అంగీక‌రిచింది. అందులో సోనాక్షి వేశ్య రోల్ చేయ‌నుంద‌ని స‌మాచారం. ఈ పాత్ర‌ను  తెర‌పై చాలా బోల్డ్ గా  ఉంటుంది.

వాస్త‌వాన్ని ప్ర‌తిబింబించేలా ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌నున్నారు. త‌న పాత్ర‌కు  త‌గ్గ‌ట్టు అన్ని ర‌కాలు గా సోనాక్షి సిద్దమ‌వుతున్న‌ట్లు టాక్.  వేశ్య పాత్ర కోసం సోనాక్షి క‌థ‌క్ కూడా నేర్చుకుంటుందిట‌. ఓ ట్యాలెంటెడ్ క‌థ‌క్ డాన్స‌ర్ ఎలాంటి ప‌రిస్థితుల్లో వేశ్య‌గా మారుతుంది అనే పాయింట్ వెబ్ సిరీస్ లో ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ తో క‌లిసి ప‌నిచేయ‌డం సోనాక్షికి  కొత్తేం కాదు. గ‌తంలో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన  `రౌడీ రాథోడ్` సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News