బాలయ్య భామ జూనియర్ తో రొమాన్సా?

Update: 2017-09-08 09:32 GMT
సెలబ్రెటీల ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు ఎలా మొదలవుతాయో ఎవ్వరికి తెలియదు. అలాగే వాళ్ళు ఎపుడు విడిపోతారో కూడా తెలియదు. దీంతో తరచు  మీడియా గాసిప్స్ లో హాట్ టాపిక్ గా హల్ చల్ చేస్తూ ఉంటారు. అయితే అదే తరహాలో ఇప్పుడు ఓ ముంబయి భామ గురించి కొన్ని ఘాటైన చిల్లి గాసిప్స్ బాలీవుడ్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఆమె ఎవరో కాదు టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ తో లెజెండ్ సినిమాలో నటించిన సోనాల్ చౌహన్. ఆ సినిమా విజయాన్ని అందించినా అమ్మడికి అవకాశాలు మాత్రం అంత పెద్దగా రాలేవు. దీంతో ముంబై కి మకాం మార్చేసింది. కానీ అక్కడ కూడా అవకాశాలు రాకపోవడంతో చివరికి టాలీవుడ్ నుంచి మరో పిలుపు రావడంతో రామ్ పండగ చేస్కో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది.  అయితే అసలు విషయం ఏమిటంటే అమ్మడు గత కొన్ని రోజులుగా ఒక బిజినెస్ టైకూన్ కుమారుడితో ప్రేమలో మునిగితెలుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆ అదృష్ట వంతుడు ఎవరో కాదు భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన విజయ్ మాల్యా కుమారుడు సిద్దార్థ్ మాల్యా.

ఇంతకుముందు ఈ మాల్యా జూనియర్ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనెతో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇక ఇప్పుడు సోనాల్ తో కలిసి డేటింగ్ కూడా చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి సోనల్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు కానీ ప్రేమ విహార యాత్రలు చేస్తూ బాలీవుడ్ మీడియాకు రోజుకో సినిమా చూపిస్తోందట.



Tags:    

Similar News