ఫోటో స్టోరి: రాత్రికి ఆలోచించే ప‌గ‌టి క‌ల‌ల రాణి!

Update: 2021-05-19 05:30 GMT
టాలీవుడ్ లో పంజాబీ భామ‌ల హ‌వా అంతంత మాత్ర‌మే. ఇంత‌కుముందు న‌వ్ నీత్ కౌర్ టాలీవుడ్ లో రాణించింది. ప్ర‌స్తుతం ఆమె రాజ‌కీయాల్లో ఉన్నారు. తాప్సీ ప‌న్ను పంజాబీ మూలాలున్న దిల్లీ బ్యూటీ. ప్ర‌స్తుతం తెలుగులో రాణిస్తున్న‌ పాయ‌ల్ రాజ్ పుత్ పంజాబీ నాయిక‌. ప‌లువురు చండీఘ‌ర్  హిమాచ‌ల్ అంద‌గ‌త్తెలు ఇలా వ‌చ్చి అలా వెళ్లిన వాళ్లున్నారు. పంజాబ్ మూలాలున్న‌ మ‌నాలి బ్యూటీ కంగ‌న ర‌నౌత్ మ‌ణిక‌ర్ణిక‌గా సుప‌రిచిత‌మైంది. త‌లైవి చిత్రంతో స‌త్తా చాటేందుకు వ‌స్తోంది.

ఇప్పుడు పంజాబీ నటి మోడల్ సోనమ్ బజ్వా దూసుకొస్తోంది. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల‌ తన ఇన్ స్టాగ్రామ్ గేమ్ ను పూర్తిగా మార్చేయ‌డం వేడి పెంచేస్తోంది. త‌ను ఏ ఫోటో షేర్ చేసినా అంత‌ర్జాలంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

తాజాగా సోనమ్ బజ్వాసోనమ్ బజ్వా చిక్ బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో థై స్లిట్ లుక్ తో హీటెక్కించింది.  గులాబీ పెదవులు ఉంగరాల జుత్తుతో బ‌జ్వా ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.  "నేను పగటి కలలు కనే అమ్మాయిని.. రాత్రి ఆలోచించేదానిని" అంటూ ఆమె తన చిత్రాలకు శీర్షిక పెట్టారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సోనమ్ బజ్వా చివరిసారిగా 2021 మార్చి 13 న విడుదలైన 'పువాడా' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. అమ్మీ విర్క్ తో కలిసి న‌ర్తించింది. ఆమె తదుపరి దిల్జిత్ దోసాంజ్ తో హోస్ నా రాఖ్ లో నటించనుంది. ఇటీవ‌ల పాయ‌ల్ లాంటి నాయిక‌లు రాణించిన తీరు చూశాక బ‌జ్వాకు తెలుగు ప‌రిశ్ర‌మ‌పై ఆశ పుట్టింద‌ట‌. ఎవ‌రైనా ద‌ర్శ‌కనిర్మాత‌లు సంప్ర‌దిస్తే న‌టించేందుకు రెడీగా ఉందిట‌. ఆ ఒక్క ఛాన్స్ వ‌రిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News