బాలీవుడ్లోకి సోనమ్ కపూర్ స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చింది. తను ఒక స్టార్ అని అనిపించుకోవడానికి మాత్రం చాలానే కష్టపడింది. 2016 లో వచ్చిన నీర్జా సినిమా నుండి ఈమె యాక్టింగ్ ను అందరూ సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టారు. సినిమాలుతో కన్నా తన ఫ్యాషన్ స్టేట్మెంట్ తో ఎక్కువ పాపులర్ అయిన ఈ హీరోయిన్ ఇప్పుడు తన 32 వ పుట్టినరోజును సీక్రెట్ గా జరుపుకుంది.
ఒక స్టార్ హోటల్ లో తెల్లని గౌన్ వేసుకొని బుజ్జి పాపాయిమల్లే.. చెల్లి రియా కపూర్ అలాగే రూమర్లలో వినిపిస్తున్న ఆ ప్రియుడు ఆనంద్ అహుజాతో కలిసి కేక్ కట్ చేసింది. ఆ వీడియో కు లా లా లాండ్ రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని జతచేసి తనే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్లో పోస్ట్ చేసింది. “నా ప్రపంచం అంతా నా దగ్గరే ఉంది. కావలిసినంత ప్రేమ దొరికింది” అని శీర్షిక కూడ పెట్టి నెట్ లోకి వదిలింది. ఇక్కడ ప్రియడు ప్రేమ ఒకవంతు అయితే మరో పక్క తండ్రి అనిల్ కపూర్ కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. అది చదివి మరి ఎమోషనల్ అయింది సోనమ్.
“ప్రతి మనిషి ఒక క్షణాన్ని తన గుండెలలో పదిలంగా దాచుకొంటాడు, మొదటిసారి ఒక పసిపాప తన చేయి పట్టుకున్న క్షణం. నాకు అటువంటి గొప్ప అనుభూతిని మొదటిసారి ఇచ్చిన సోనమ్ కి నా శుభాకాంక్షలు” అని పెట్టాడు. పుట్టినరోజు నాడు అమ్మడికి ఇటు డాడీ.. అటు ప్రియుడు.. ఇద్దరీ ప్రేమా దొరికిందనే చెప్పాలా? అసలు తన ప్రేమను ఇప్పటికైనా సోనమ్ ఓపెన్ గా చెప్పిందనే అనుకోవాలా? ఆలోచించండి.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/