లవ్వర్ తో టూర్లో ఫిట్నెస్ కోసం పాట్లు

Update: 2017-08-04 08:30 GMT
బాలీవుడ్ లో ఒక ఫేమస్ కపూర్ ఫ్యామిలి నుండి వచ్చి స్టార్ అయిన సోనమ్ కపూర్ ఇప్పుడు తన సినిమాలతో పాటుగా తన వ్యక్తిగత జీవితం పై కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. సోనమ్ కపూర్ కు పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నాడు తండ్రి అనిల్ కపూర్. డిల్లీ 6 తో తన చందంతో ఫేమస్ అయినా కమర్షియల్ హిట్స్ మాత్రం సోనమ్ కెరియర్లో లేవనే చెప్పాలి. అప్పటి నుండి నిన్న వచ్చిన ‘నీర్జా’ సినిమా వరకు ఆమె స్టార్ అవడానికి బాగనే కష్టపడింది. నటిగా అందరూ గుర్తించినా ఇంకా ఆమెకు క్రేజీ కమర్షియల్ హీరోయిన్ ఫాలోయింగ్ అయితే రాలేదు.

అప్పుడు అప్పుడు తన ఫ్యాషన్ తో అందరిని ఆశ్చర్యపరిచి తన అందాలకు బాగగా నే మార్కెట్ చేస్తుంది సోనమ్. సినిమాలు విషయంగా ఈమె కు పోటీలో చాలామంది ఉన్నారు కానీ ఫ్యాషన్ విషయంలో మాత్రం లేరు. ఇప్పుడు తన హాట్ లుక్కును మరింత హాట్ గా మార్చుకొని ఫిట్ గా కనిపించాలని కొత్తగా ఒక ఫిట్నెస్ కోర్సు కూడా జాయిన్ అయ్యింది. న్యూ యార్క్ లో తన బోయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాతో సరదాగా కాలం గడుపుతోందీ అమ్మడు. అక్కడకు వెళ్లింది టూర్ కైనా సోనమ్ ఫిట్నెస్ పై ఉండే ఇష్టం తో ఫిజికల్ ఫిట్నెస్ కోర్సు లో చేరిందట. ఆనంద్ ఆహుజా ఏమో తన బిజినెస్ మీటింగ్ లలో బిజీ ఉన్నప్పుడూ సోనమ్ ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ లో బిజీ గా ఉంటుందట. న్యూ యార్క్ లో ఉండే ఫేమస్ ఫిట్నెస్ స్టూడియో బ్ర్యంట్ పార్క్ లో తెగ కష్టపడుతుంది అంటా మరింత హాట్ గా కనిపించడానికి.

బోయ్ ఫ్రెండ్ కూడా తన ఫ్యాషన్ బిజినెస్ ని ఇంకా ఎలా పెంచాలి అని ఫోకస్ చేస్తునట్లు తెలుస్తుంది. వీళ్ళ ప్రేమ కూడా ఇప్పుడు పెళ్లి వైపు అడుగులు వేస్తుంది. బహుశా వచ్చే ఏడాది సోనమ్ కపూర్ ఒక ఇంటి కోడలు అవ్వొచ్చేమో. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న పాడ్ మాన్ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ గా నటించబోతుంది సోనమ్ కపూర్.


Tags:    

Similar News