సెక్సీ కపూర్.. ఇక పెళ్ళే తరువాయి

Update: 2017-07-12 13:12 GMT
సాధారణంగా టాప్ హీరోయిన్లు పెళ్లి అంటే ఆమడు దూరంలో ఉంటారు. పెళ్లి చేసుకుంటే కెరియర్ బ్రేక్ వస్తుందని.. దాన్ని ఇప్పుడు మేము భరించలేము అని చాలాసార్లు వాళ్ళ అభిప్రాయాలును చెబుతూనే ఉన్నారు. ఎవరిని అడిగినా నాకు సరిపడే రాకుమారుడు కోసం వెతుకుతున్నా అని అంటారు కానీ..  పోనీ దొరికిన వాళ్ళ పేరు చెప్పడానికి ఆలోచిస్తారు. ఇక అనిల్ కపూర్ కూతురు.. సెక్సీ డివా సోనమ్ కపూర్ మాత్రం నాకు పెళ్లి వయసు వచ్చింది అని అందరికి బ్యాండ్ భాజా వేసి చెప్పేస్తోంది.

కొద్ది కాలంగా సోనమ్ కపూర్ ఆమె బోయ్ ఫ్రెండ్ డిన్నర్లు - బయట విహారాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనమ్ కపూర్ మొన్న జరుపుకున్న పుట్టినరోజు నాడు కూడా తన సోదరితో పాటుగా బోయ్ ఫ్రెండ్ ఆనంద్ అహుజా తో కలిసి డిన్నర్ కు వెళ్ళి అందరికి తన కాబోయే భర్త ఎవరు అయి ఉంటుంది అనే అనుమానంకు తెరదించింది.  సోనమ్ కపూర్  నటించిన ‘నీర్జా’ సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఆ ఫంక్షన్కు సోనమ్ కపూర్ నాన్న అనిల్ కపూర్ తో పాటుగా ఆనంద్ అహుజా కూడా వచ్చాడు. అనిల్ కపూర్ కూడా సోనమ్ ను పెళ్లి చేసుకో అని తొందర పెడుతున్నాడు అని తెలుస్తుంది. అమ్మాయి సోనమ్ కుటంబం వాళ్ళకి అబ్బాయి బాగా నచ్చాడట.. ఇంకా అటు అబ్బాయి కుటంబం వాళ్ళకి కూడా ఓకే అని తెలుస్తుంది. ఆనంద్ అహుజా డిల్లీ లో ఫ్యాషన్ బిజినెస్ చేస్తుంటాడు.

సోనమ్ కపూర్ ఇప్పుడు ‘వీర్ దీ వెడ్డింగ్’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది. ఈ సినిమాను తన చెల్లి రియా కపూర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ‘వీర్ దీ వెడ్డింగ్’ సినిమాలో కరీనా కపూర్ ఖాన్ కూడా నటిస్తుంది. సోనమ్ పార్టీలు, బిజినెస్ టూర్లు, ఫ్యాషన్ ముచ్చట్లు, నాన్న మాటలు చూస్తుంటే తొందరలో సోనమ్ కపూర్ ఒక ఇంటి కోడలు కాబోతుంది అనే అనిపిస్తుంది.​
Tags:    

Similar News